నవతెలంగాణ-వీణవంక
కిసాన్ సెల్ మండల అధ్యక్షుడిగా మండలంలోని బొంతుపల్లి గ్రామానికి చెందిన చదువు జైపాల్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు జైపాల్ రెడ్డికి కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు పత్తి క్రిష్ణారెడ్డి మంగళవారం నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రైతుల సమస్యలపై పోరాడుతానని స్పష్టం చేశారు. అలాగే తన నియామకానికి సహకరించిన క్రిష్ణారెడ్డితో పాటు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు బల్మూరి వెంకట్ కి ధన్యవాదాలు తెలిపారు.