అన్ని పాఠశాలల్లో జూలై 31 వరకు పఠనోత్సవం

– బద్దం సుదర్శన్ రెడ్డి జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్
నవతెలంగాణ-గోవిందరావుపేట :  అన్ని పాఠశాలల్లో జూలై 31 వరకు పఠనోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కో ఆర్డినేటర్ బద్దం సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం మండలం లోని ఎంపీపీఎస్ అభ్యుదయ కాలనీ, ఎంపీపీఎస్ పసర నాగారం, ఎంపీపీఎస్ పాతూరు , ఎంపీపీఎస్ హరిజన కాలనీ లను సందర్శించి రీడ్ కార్యక్రమం అమలును పరిశీలన చేయటం జరిగింది. ఈ సంధర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతు ” అన్ని పాటశాల లో జూలై 31 వరకు పఠనోత్సవం కార్యక్రమం ను నిర్వహించాలని , అకాడమిక్ క్యాలెండర్ ను అనుసరించి తరగతి బోధన చేయాలనీ, ప్రతీ తరగతి కి ప్రతీ రోజు ఒక గ్రంధాలయ పీరియడ్ ను కేటాయించాలని చెప్పారు.విద్యార్థుల చేత పుస్తకాలు చదివించాలని గ్రంధాలయ పీరియడ్ వారం లో మూడు రోజులు తెలుగు రెండు రోజులు ఆంగ్లం, ఒకరోజు హిందీ నిర్వహించాలని చెప్పారు. పాఠ్య పుస్తకాలు, ఏక రూప దుస్తులు అందించాలని సూచించారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం తయారు చేయాలని మారియు వారం లో మూడు రోజులు కోడి గుడ్డు, మూడు రోజులు రాగి జావ అందించాలని సూచించారు.ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని ములుగు వెలుగు అప్ లో సకాలం లో హాజారు నమోదు చేయాలని మరియు విద్యార్థుల వివరాలను విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ లో పొందుపరచి నవీకరించాలని చెప్పారు. ఈ సందర్శన లో సి ఆర్ పి బిక్షపతి పాల్గొన్నారు.