అసలు నాయకుడేవరూ.. అయోమయంలో కార్యకర్తలు

– దుబ్బాక నియోజకవర్గంలో పోటా పోటీగా ప్రచారాలు
– తామంటే తాము ఎమ్మెల్యే అభ్యర్థులమంటున్న లీడర్లు
– తిరిగి దుబ్బాక లో కాంగ్రెస్ విజయం సాధించేనా
– అయోమయంలో కార్యకర్తలు
– త్రిముఖ పోరులో నికార్సైన లీడర్ ఎవరు
– యాత్రల పేరిట గ్రామాల్లో పరంపర పర్యటనలు
నవతెలంగాణ -దుబ్బాక రూరల్
దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీపై బహిరంగంగా విమర్శలు రావడం ఉమ్మడి మెదక్ జిల్లాలో చర్చనీయాంశం కాగా.. ప్రస్తుతం దుబ్బాక లో కాంగ్రెస్ లీడర్లు ప్రజల్ని మచ్చిక చేసుకోలేక పోతున్నారని ఆపార్టీ సీనియర్ లీడర్స్ బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ గుర్తుపై నియోజకవర్గంలో పన్యాల శ్రావణ్ కుమార్ రెడ్డి (హత్ సే హత్ జోడో యాత్ర),చెరుకు శ్రీనివాస్ రెడ్డి(దుబ్బాక నియోజకవర్గ ఆత్మగౌరవ యాత్ర), కత్తి కార్తిక గౌడ్ జోడో యాత్రల పేరిట ప్రజల్ని కలుస్తూ ప్రచారాలు చేస్తున్నారే తప్ప.. పార్టీ హయాంలో జరిగిన నియోజకవర్గ అభివృద్ధి ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు. ఎన్నికలు ఎప్పుడూ వచ్చినా తామంటే తాము ఎమ్మెల్యే అభ్యర్థులమని చెబుతున్నారే తప్ప ప్రజల నాడీ, కార్యకర్తలు బాధలు, కష్టాలను ఇక్కడి నేతలు అంటిపట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే  విమర్శలు పార్టీలో వినిపిస్తున్నాయి.దీంతో ఎప్పుడూ ఏ నాయకుడు, ప్రచారానికి పిలుస్తారో, ఎవరూ ఎక్కడికీ వెళ్ళాలో తెలియక కాంగ్రెస్ కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. యాత్రల పేరిట జరిగే ప్రచారాల్లో పట్టుమని పదిమంది కార్యకర్తలు లేకుండానే గ్రామాల్లో ప్రచారాలు సాగిస్తున్నారు. ఇక కారులోంచి దిగి పోటీకి ఫోజులు ఇచ్చి ప్రచారాలు చేస్తున్నామంటూ ఆర్భాటాలే ఎక్కవగా కనిపిస్తుందటం గమనార్హం. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకింగ్ సాధించుకోవడానికి ఇక్కడి లీడర్లు నానతంటాలు పడుతున్నా.. ప్రజల బాగోగులనీ కష్ట ,సుఖాలను పంచుకోవడంలో ఇంకా ఈ నేతలు వెనుకంజలో ఉన్నారు. సమయం వచ్చినప్పుడు మాత్రమే ఉద్యమం, పోరాటాలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారనే విమర్శలు ప్రజల్లోంచి వినిపిస్తున్నాయి.ఇక ఈ పరిస్థితుల్లో దుబ్బాక లో తిరిగి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకింగ్ ద్వారా సాధించేనా అన్న సందేహాలు కాంగ్రెస్ శ్రేణుల్లో తలేత్తుతున్నాయి. ఇప్పటికే దుబ్బాక తెరపై ముగ్గురు లీడర్లు కనబడటంతో త్రిముఖ పోరులో ఎవరికీ వారే ఏమునా తీరా అన్న చందంగా పార్టీ కార్యకలాపాలు సాగిస్తున్నారు. దీంతో దుబ్బాక కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆందోళన అయోమయం మొదలైంది.నిఖార్సైన కాంగ్రెస్ లీడర్ కోసం అటు సీనియర్ లీడర్లు, కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నట్లు సమాచారం.