నవతెలంగాణ-శామీర్‌పేట
మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల (జగద్గిరిగుట్ట) శామీర్ పేటలో పారిశుధ్య నిర్వహణ టెండర్ పై దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇష్రత్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొ న్నారు. పారిశుధ్య నిర్వాహణ టెండర్ కొరకై దరఖాస్తులు చేసుకోవడానికి ఈనెల 20 చివరి తేదీ అని ఆసక్తిగల పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థినులు వారి తల్లిదండ్రులు దరఖాస్తుకు 500 రూపాయలు డిడి రూపంలో శామీర్ పేట కళాశాలలో సమర్పించాలని కోరారు. దరఖాస్తు ఫారం స్వీకరణ సమయం ఉదయం 10:00-04:00 గం|| వరకు ఉంటుందని ఈనెల 20 వరకు టెండర్ ప్రకటించుకోవలన్నారు. మరిన్ని వివరాలకు చరవాణి 9121004530 నంబర్‌కు సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు.