నవతెలంగాణ -డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ ఇంచార్జీ వైస్ ఛాన్సలర్ వాకాటి కరుణ ఐఏఎస్ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.యాదగిరి శుక్రవారం పలువురు అధ్యాపకులకు అకాడమిక్ బాధ్యతలను అప్పగించారు. బయోటెక్నాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం. ప్రసన్న శీల ను మైక్రో బయాలజీ విభాగానికి, బోటనీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అహ్మద్ అబ్దుల్ హలీం ఖాన్ ను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు చైర్మన్ బోర్డ్ అఫ్ స్టడీస్ గా నియమించారు. సోషల్ వర్క్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వీరభద్రం భూక్యాను పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ ఇంచార్జి హెడ్ గా నియామక ఉత్తర్వులను అందజేశారు. తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధ్దికి పాటుపడతామని తమపై నమ్మకంతో నియామకపు ఉత్తర్వులను అందించిన వైస్ ఛాన్సలర్, రిజిస్టార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు