
మండలంలోని రెడ్డి పేట తాండ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికైనట్లు బుధవారం ప్రధానోపాధ్యాయులు లక్ష్మీరాజ్యం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ బాలుర విభాగంలో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు మొదటి స్థానంలో గంగావతి సందీప్, రెండవ స్థానంలో గంగావత్ నవదీప్, మూడవ స్థానంలో సలావత్ రాకేష్ నిలిచినట్లు తెలిపారు. వచ్చేనెల రాష్ట్రస్థాయిలో జరిగే పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ… ఇదే పటిమను కనబరుస్తూ జాతీయ స్థాయిలో సత్తా చాటాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు వారిని అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కే నరేష్, జే సుధారాణి, మహేందర్, సయ్యద్ కాజా, జి అనురాధ, జి ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.