రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించాలి…

ఎంపిపి బాదవత్ రమేష్ నాయక్.
నవతెలంగాణ – డిచ్ పల్లి
సిఎం కప్‌ 2023 క్రీడా పోటీలను డిచ్ పల్లి మండలంలోని ఖిల్లా డిచ్ పల్లి, ఇందల్ వాయి మండలలోని గన్నరం గ్రామలలోని జడ్పిఎస్‌ఎస్‌లో ఎంపిపి బాదవత్ రమేష్ నాయక్, ఎంపిడివో రాములు నాయక్, తహసిల్దార్లు శ్రీనివాస్ రావు, గోపి బాబు, టివి రోజా బి అర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చిలివెరి గంగా దాస్,ఎంపివో రాజ్ కాంత్ రావు ప్రజా ప్రతినిధులతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంపిపి బాదవత్ రమేష్ నాయక్ మాట్లాడుతూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు ఆదేశాల మేరకు మండల స్థాయిలో 15, 16,  17వ తేదిలలో నిర్వహించన్న క్రీడపోటిల్లో యువకులు పాల్గొని తమలో దాగి ఉన్న క్రీడను బయటికి తీసి విజయం సాధించాలని సూచించారు. క్రీడా పోటీలలో ఉత్సాహం ఉండి బయట ఆడే యువత ఈ క్రీడా పోటీల సందర్బంగా పేర్లు నమోదు చేసుకొని పోటీల్లో పాల్గొనాలని, మండల స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు వెళ్లి పోటి చేయొచ్చని అన్నారు. మండల స్థాయిలో పోటి చేసే క్రీడాకారుల క్రీడలను జిల్లా క్రీడా కమిటి, ఒలంపిక్‌ సంఘం సభ్యులు పరిశీలిస్తారని అన్నారు. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి, ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ లకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ గోపి బాబు,ఎంపివో నిట్టు కిషన్ రావు, ఆయా గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు, పిఈటీ లు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.