
తెలంగాణ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకులు రెగ్యులరైజ్ టు సర్వీస్ ప్రధాన డిమాండ్ ను అసెంబ్లీ సాక్షిగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీకి చెందిన కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని అధికార పార్టీ నుండి డిమాండ్ ను రెగ్యులరైజ్ చేయలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ద్వారా ప్రభుత్వానికి విన్నవించారని తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం అధ్యక్షులు వి దత్తాహరి శనివారం తెలిపారు. 12 యూనివర్సిటీలకు చెందిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు రుణపడి ఉంటామని, గాధారి కిషోర్ మా ప్రస్తావన తెచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో గత 78 రోజుల నుండి నిరంతరము పోరాటం చేస్తూనే ఉన్నామని, గత మూడు రోజుల క్రితం హైదరాబాదులో క్యాబినెట్ మంత్రులను ఇతర ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లను కలవడం, మా సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరినట్లు ఆయన తెలిపారు. దీంట్లో కీలక భూమిక పోషించినట్లు బోయిన్పల్లి వినోద్ కుమార్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బాల్క సుమన్, దయాకర్ రెడ్డి, దయాకర్ రావు, జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ తమ అమూల్యమైన సమయాన్ని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల రెగ్యులరైజ్ విషయం ప్రభుత్వ దృష్టిలో ఉందని చెప్పారు. ఇప్పటికైన ప్రభుత్వం న్యాయమైన డిమాండ్ రెగ్యులరైజ్ చేసే విధంగా చూడాలని అయన కోరారు.ఈ కార్యక్రమం లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు గంగా కిషన్, నాగేశ్వరరావు, డాక్టర్ జలంధర్, బీఆర్ నేత, డాక్టర్ స్వామి రావు, డాక్టర్ జోష్ణ ,డాక్టర్ అపర్ణ, డాక్టర్ శరత్, డాక్టర్ మోహన్, డాక్టర్ ఆనంద్, డాక్టర్ సందీప్ ,డాక్టర్ నరసింహులు, డాక్టర్ గంగాధర్, డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ సురేష్, డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ డానియల్ తదితరులు పాల్గొన్నారు.