ఆర్ట్స్ కళాశాలలో నూతన షెడ్డును పర్యవేక్షించిన రిజిస్ట్రార్ ఎం.యాదగిరి

నవతెలంగాణ డిచ్ పల్లి: తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో  అడ్మిషన్స్, స్కాలర్షిప్స్  సెక్షన్ కౌంటర్ల  లో  కళాశాల విద్యార్థులకు ఎండా, వర్షం లాంటి ఆసౌకర్యాలను నివారించడం కోసం  కౌంటర్లపై  నూతన షెడ్డును, దరఖాస్తు ఫారం నింపుకొనుటకు  సౌకర్యవంతంగా  టేబుల్స్  నిర్మాణం ఇంచార్జీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వాకాటి కరుణ  ఆదేశాల మేరకు చేపట్టడం జరిగిందని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి వివరించారు. శనివారం యూనివర్సిటీ లోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో  అడ్మిషన్స్, స్కాలర్షిప్స్  సెక్షన్ కౌంటర్ల నిర్మాణంతో దూర ప్రాంతం నుండి  బదిలీ సర్టిఫికెట్లు,  అడ్మిషన్ పొందడం, స్కాలర్షిప్ రెన్యువల్ కొరకు  లైన్లో నిల్చున్న విద్యార్థులకు  సౌకర్యంగా ఉంటుందని  రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ యం. యాదగిరి  పర్యవేక్షించి నిర్మాణం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పర్యవేక్షణ సమయంలో రిజిస్ట్రార్  వెంట కళాశాల ప్రిన్సిపాల్  సిహెచ్ హారతి, యూనివర్సిటీ ఇంజనీర్ వినోద్  ఉన్నారు.