రెగ్యులరైజేషనే మా ప్రధాన డిమాండ్..

– యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు..
నవతెలంగాణ -డిచ్ పల్లి
రెగ్యులరైజ్ ఏ తమ ప్రధాన డిమాండ్ ఉందని ప్రభుత్వం చిత్తశుద్ధితో వేంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తెలంగాణ యూనివర్సిటీ లో కాంట్రాక్ట్ అధ్యాపకులు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం అధ్యక్షులు వి దత్తాహరి పాల్గొని మాట్లాడుతూ రెగ్యులరైజేషన్ కోసం రాష్ట్రం లోని అన్ని యూనివర్సిటీలో ఉన్న కాంట్రాక్ట్ అధ్యాపకులందరు  రెగ్యులరైజ్ కావాలని మా ప్రధాన డిమాండ్ ఉందన్నారు. ఉన్నత చదువులు చదువుకొని, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నమన్నారు. యూనివర్సిటీలో కాంట్రాక్ట్ పై పనిచేస్తున్న ఉపాధ్యాయులను వెంటనే క్రమబద్ధకరించాలని, గతంలో సీఎం కెసిఆర్ ఇచ్చిన మాటని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు గంగ కిషన్, జి శ్రీనివాస్, గంగాధర్, నర్సింలు, సందీప్, ఆనంద్, దేవరాజ్ శ్రీనివాస్, సిహెచ్ శ్రీనివాస్, నాగేంద్రబాబు, నాగేశ్వరరావు, సురేష్, రాజేశ్వర్, అపర్ణ, జోష్ణ,  స్వామి రావు, మోహన్, గోపి రాజ్, కిరణ్ రాథోడ్, రామలింగం, నర్సయ్య, ప్రవీణ్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.