– సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి
– టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ఎదుట ధర్నా
కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది సమస్యలు పరిష్కరిం చాలని డిమాండ్ చేస్తూ టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళనలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేసి.. వినతిపత్రాలు అందజేశారు
నవతెలంగాణ- విలేకరులు
వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు సీహెచ్ వెంకట్‌రత్నం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కేజీబీవీ, యూఆర్‌ఎస్ పనిచేస్తున్న ఉపాధ్యా యుల సమస్యలను పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గాలయ్య డిమాండ్ చేశారు. రంగారెడ్డి కలెక్టరేట్‌ను ముట్టడి అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ఎం.రాజశేఖర్‌రెడ్డి, జి.నాగమణి ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా అనంతరం అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. యాదాద్రిభువనగిరి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో టీటిడి కల్యాణ మండపం వద్ద ధర్నా నిర్భహించారు. వారికి సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్.కురుమూర్తి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంతచారి మద్దతు తెలిపారు. కేజీబీవీ యూఆర్‌ఎస్ ఉపాధ్యాయ ఉద్యోగులకు బేసిక్‌పే మంజూరీ చేసి రెగ్యలరైజ్ చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె.జంగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. కేజీబీవీ యూఆర్‌ఎస్ ఉపాధ్యాయ ఉద్యోగులు బేసిక్ పే ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించి, సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. తదనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కేజీబీవీ, యుఆర్‌ఎస్ సిబ్బంది వనపర్తి కలెక్టర్ కార్యా లయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నానుద్దేశించి టీఎస్ యుటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.రవి ప్రసాద్‌గౌడ్ మాట్లాడారు. అనంతరం ఏవో మోహన్‌కు వినతిపత్రం అందజేశారు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నాలో యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గా భవాని మాట్లాడుతూ.. కస్తూర్బా బాలిక విద్యాలయాలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న బోధన బోధనేతర సిబ్బందిలో దాదాపు అందరూ మహిళలేనని తెలిపారు. వారి సేవలను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజే శారు. ఆసిఫాబాద్, ఆదిలాబాద్ కలెక్టర్గేట్ల ఎదుట ధర్నా చేపట్టారు. జనగామ జిల్లా కలెక్టరేట్ ఎదుట కేజీబీవీ, యూఆర్‌ఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగులు బైటాయించి ధర్నా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్‌లో ధర్నా చేపట్టారు.