జుక్కల్ అసెంబ్లీలో ఆరు నామినేషన్ల తిరస్కరణ

నవతెలంగాణ- మద్నూర్: జుక్కల్ ఎస్సీ రిజర్వుడు కాన్స్టెన్సీకి జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా పోటీ చేసేందుకు మొత్తం 28 మంది 50 నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఈనెల 13న సోమవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి మను చౌదరి ఐఏఎస్ అధికారి చేపట్టారు నామినేషన్ల పరిశీలనలో మొత్తం ఆరు నామినేషన్లు తిరస్కరించడం జరిగిందని ఎన్నికల అధికారి తెలిపారు తిరస్కరణకు గురైన నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి,1. శోభావతి బీఆర్‌ఎస్‌,2. గంగాధర్ సౌదాగర్ కాంగ్రెస్,3. రేవన్ సర్దే వార్ బీజేపీ,4. రాజు యుగ తులసి పార్టీ,5, రాజశేఖర్ గైని భారత చైతన్య యువజన పార్టీ,6, కామ్లే నాందేవ్ ఇండిపెండెంట్, ఈ విధంగా ఆరు నామినేషన్లు తిరస్కరించడం జరిగిందని ఎన్నికల అధికారి తెలిపారు మిగతా అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగానే ఉన్నట్లు అధికారి తెలియజేశారు. నామినేషన్ల పరిశీలన కార్యక్రమంలో అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎండి ముజీబ్ నామినేషన్ల దాఖలు చేసిన అభ్యర్థులు పాల్గొన్నారు.