
రెంజల్ మండల కేంద్రంలోని బందల్లా, మాచాపురం, గంగమ్మ తల్లి, శివాలయం బైపాస్ రోడ్ల మరమ్మత్తు పనులు నిరంతరంగా కొనసాగించాలని లేనియెడల 15 రోజుల తర్వాత రైతుల కార్యచరణ ఉంటుందని రైతులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ 45 రోజున రోడ్ల మరమ్మతులు జరిపించాలని రిలే నిరాహార దీక్ష చేపట్టిన రైతుల వద్దకు, బోధన్ రూరల్ సీఐ శ్రీనివాస్ రాజ్, తాసిల్దార్ రామచందర్, ఎస్సై ఉదయ్ కుమార్ లు ప్రొసీడింగ్ ఆర్డర్ వచ్చిందని త్వరలోనే రోడ్ల మరమ్మ తెలుపనులు జరుగుతాయి మీరు దీక్ష విరమించుకోవాలని కోరగా, రైతులు అందుకు సమ్మతించలేదన్నారు. గతంలో కోటి 54 లక్షల రూపాయల మంజూరు అయ్యాయాన్ని శిలాఫలకం వేసినప్పటికీ రోడ్ల పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం మూడు కోట్ల 45 లక్షల రూపాయలు మంజూరైనట్లు తెలిసిందని, పనులు నిరంతరంగా జరిపించినట్లయితే తాము స్వచ్ఛందంగా విరమించుకుంటామని వారు తెలిపారు. 46వ రోజు యధావిధిగా రిలే నిరాహార దీక్ష కొనసాగుతూ ఉండగా, స్థానిక సర్పంచ్ మండలంలోని ప్రజాప్రతినిధులందరినీ దీక్షా శిబిరం ఎదుట మోహరించి రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి దీక్షను విరమించాలని టిఆర్ఎస్ నాయకులను తమ పైకి ఉసిగొల్పడం ఎంతవరకు సమంజసం అన్నారు. ఇప్పటికైనా పనులను నిరంతరంగా కొనసాగించినట్లయితే రైతులకు ఎలాంటి అభ్యంతరం లేదని, పనులనునిలిపివేస్తే మాత్రం రైతుల కార్యచరణను కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు అమ్రాద్ వెంకటి, ఇందిరా రెడ్డి, కొండల్ వాడి శ్రీనివాస్, కటిక శ్రీనివాస్, చుక్క రాజు గౌడ్, తిరుపతి హనుమన్లు ( బుజ్జి) సగ్గు వెంకటి, దేశ్ పేట్ పోశెట్టి, మదన్ మోహన్ రెడ్డి, స్థానిక రైతు నాయకులు పాల్గొన్నారు.