మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న రెంజల్ ఆరోగ్యం విస్తీర్ణ అధికారి…

నవతెలంగాణ: రెంజల్
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి వేములప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య విస్తీర్ణ అధికారి కరిపే రవీందర్ కు అవార్డు అందజేశారు. ఉద్యోగరీత్యా తన పని తను చేసుకుంటూనే, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో రెడ్ క్రాస్ సంస్థ ద్వారా తమ సేవలను గుర్తించాలని వారన్నారు. ప్రస్తుతం వీరు లైన్స్ క్లబ్ జిల్లా సెక్రెటరీగా కొనసాగుతున్నారు. వీరి సేవలను  రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న విట్టల్ రావు, జిల్లా కలెక్టర్ రాజీవ్ హనుమంతులు ఈ అవార్డును అందజేశారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి రవీందర్ కృతజ్ఞతలు తెలియజేశారు.