ప్రమాదపు గుంతకు మరమ్మత్తులు…

నవతెలంగాణ -నవీపేట్: మండల కేంద్రంలో గత కొన్ని నెలలుగా ప్రమాదకరంగా మారిన గుంతకు బిజెపి నాయకులు ఆదివారం మరమ్మత్తు చేపట్టారు.మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో గల మిషన్ భగీరథ పైపులైనుకు మరమ్మత్తులు చేపట్టి నామమాత్రంగా పూడ్చారు. దీంతో మండల కేంద్రంలోని ప్రయాణికులతో పాటు బాసర, భైంసా దూర ప్రాంతాలకు వెళ్ళు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడమే కాక తరచూ ప్రమాదలకు గురయ్యారు.ఈ ప్రమాదపు గుంతను పూడ్చాలని సోషల్ మీడియాలో సైతం గత కొన్ని రోజులుగా ప్రజలు పాలకుల దృష్టికి తీసుకువచ్చిన మరమ్మత్తులు చేయడంతో నిర్లక్ష్యం వహించారు. దీంతో బిజెపి యువకులు డస్ట్ వేసి, నీటితో మరమ్మత్తులు చేపట్టడం పట్ల స్థానికంగా ప్రశంసలు వెల్లువేత్తుతున్నాయి.అధికార యంత్రాంగం పాలకుల నిర్లక్ష్యానికి ఇదే నిదర్శమని పలువురు చెప్పుకున్నారు. మరమ్మతులు చేపట్టిన వారిలో గణేష్, రాజేందర్ గౌడ్,రాము, భూషణ్, బాలగంగాధర్, కాంతం రెడ్డి, బండారి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.