నవతెలంగాణ- నవీపేట్: తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన మేకల, వారాంతపు సంతలు జరిగే మండల కేంద్రంలోని సంత ప్రాంగణంలో సర్పంచ్ ఏటీఎస్ శ్రీనివాస్ కంకర పౌడర్ తో మరమ్మత్తులను బుధవారం చేపట్టారు. వర్ష కాలంలో సంత ప్రాంగణం పూర్తిగా బురదమయం కావడంతో క్రయవిక్రయదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో సర్పంచ్ శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో ప్రాణహిత చేవెళ్ల కాంక్రీట్ పౌడర్ ను టిప్పర్లతో తరలించి మరమ్మతులు చేపడుతున్నారు. సంత ప్రాంగణం సిమెంట్ కాంక్రీట్ చేయాలని భావించిన మేకలకు ఇబ్బందులు తలెత్తుతాయని వ్యాపారస్తులు సూచించడంతోనే కాంక్రీట్ పౌడర్ తో మరమ్మతులు చేపడుతున్నట్లు సర్పంచ్ ఏటీఎస్ శ్రీనివాస్ తెలిపారు.