అర్హులకు దళిత బంధు ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతి

నవతెలంగాణ- నవీపేట్: అర్హులైన దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే షకీల్ అమీర్ కు శనివారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి మానికొల్ల గంగాధర్ మాట్లాడుతూ మాదిగ మాదిగ ఉపకులాలతో పాటు అర్హులైన దళితులందరికీ దళిత బంధు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగ విద్యార్థి సమాఖ్య అధ్యక్షులు కొండ నర్సింలు, గుర్రాల మోహన్, సంజీవ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.