నవతెలంగాణ-నాంపల్లి
గ్రామపంచాయతీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని మండలంలోను నాంపల్లి, చిట్టెంపహాడ్, నెమిల్లగూడెం, దామెర, మహ్మదాపురం, నేరెళ్లపెళ్లి, పెద్దాపురం, చలవానుకుంట పస్నూరు, గ్రామాలలో తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సమస్యలతో కూడిన వినతి పత్రాలను సోమవారం ఆయా గ్రామపంచాయతీ సర్పంచ్, కార్యదర్శులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ గ్రామపంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది అందరినీ పర్మినెంట్ చేయాలని, పీఆర్‌సీ నిర్ణయించిన బేసిక్ వేతనం చెల్లించాలని, ఆలోపు జీవో నెంబర్ 60 ప్రకారం స్లీపర్లకు 15,600, బిల్ కలెక్టర్లకు 19,500, కంప్యూటర్ ఆపరేటర్లకు 22,750 రూపాయలు నిర్ణయించి ఇవ్వాలన్నారు. మొత్తం 13 డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు కారోబర్లు, బిల్ కలెక్టర్లు, మరియమ్మ, వైష్ణవి, ఈరమ్మ, సులోచన, లక్ష్మమ్మ, రాములమ్మ, పార్వతమ్మ, అక్బరలి, వెంకటయ్య, పద్మ, సత్యనారాయణ, రవి, దామర రాములు, నాంపల్లి నరేష్, తదితరులు పాల్గొన్నారు.