‘రెరా’ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

 హర్యానా రెరా సభ్యులు అశోక్‌ సంగ్వామ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు విధిగా రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చట్టం ప్రకారం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని హర్యానా రాష్ట్ర గురుగ్రామ్‌ సభ్యులు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అశోక్‌ఱ సంగ్వామ్‌ అన్నారు. దీనివల్ల కొనుగోలుదారుల నమ్మకానికి భరోసా ఉంటుందనీ, వ్యాపార విస్తరణా పెరుగుతుందని చెప్పారు. శుక్రవారంనాడాయన హైదరాబాద్‌లోని ‘టీఎస్‌ రేరా’ కార్యాలయాన్ని సందర్శించారు. టీఎస్‌రేరా చైర్మెన్‌ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ, సభ్యులు కే శ్రీనివాసరావు, జే లక్ష్మీనారాయణ ఇతర అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. హర్యానా గురు గ్రామ్‌ రెరా చట్టం అనుభవాలు, తెలంగాణ రాష్ట్ర రెరా అనుభవాలు, చట్టం అమలు తీరుపై పరస్పరం చర్చలు జరిపారు. హర్యానాలో గురుగ్రామ్‌తో పాటు పంచకుల రెరా కార్యాలయాల ద్వారా చట్టాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. కొనుగోలుదారుల హక్కులు, బిల్డర్ల పరిరక్షణ, ప్రమోటర్లు పారదర్శకత, జవాబుదిదారుతనం సమ్మిళితంగా రెరా చట్టం వచ్చిందనీ, దాన్ని ఉద్యమ స్ఫూర్తితో అమలు చేయాలని చెప్పారు.