అలైన్‌మెంట్‌ మార్చాలని తీర్మానం

– ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి పర్యవేక్షణలో ఆమోదం
నవతెలంగాణ -భువనగిరిరూరల్‌
ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్చాలని గత కొద్ది నెలలుగా రాయగిరి గ్రామస్తులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించగా గురువారం భువనగిరి పట్టణంలో మున్సిపల్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి పర్యవేక్షణలో మున్సిపల్‌ ఎళిసబష్ట్రbశ్రీన ఎనబోయిన ఆంజనేయులు అధ్యక్షతన ప్రత్యేక సమావేశ నిర్వహించి, అలైన్మెంట్‌ మార్చాలని తీర్మానం చేశారు. ఆర్‌ ఆర్‌ ఆర్‌ రోడ్డుకు పేద ప్రజల భూములు, గతములో నేషనల్‌ హైవే కు, కాళేశ్వరం ప్రాజెక్టుకు, యాదగిరిగుట్ట రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయామని ఎమ్మెల్యే కు విన్నవించారు. దగ్గరుండి మున్సిపల్‌ సమావేశంలో ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్మెంట్‌ మార్చాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.తీర్మానం చేయించడం పై ఎమ్మెల్యేకు , మునిసిపల్‌ ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.