మయాంక గోయెల్… ఆల్ఫ్రెడ్ పి. స్లోన్ ఫౌండేషన్ రైటింగ్ అవార్డు విజేత. ఆమె రాసిన ”ఎట్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్” అనే స్క్రీన్‌ప్లేకు రైటింగ్ అవార్డును గెలుచుకుంది. బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమతో అనుబంధం ఉన్న కుటుంబంలో పెరిగిన ఆమెకు ఈ అవార్డు ఒక సరైన దిశను చూపించింది. అంతే కాదు స్లోన్ అవార్డు పరిశ్రమలో కొనసాగేందుకు ఓ భరోసా ఇచ్చింది. నష్టాల కంటే ఎక్కువ తిరస్కరణలు ఉండే రంగంలో సాధించిన ఈ విజయం తన కష్టానికి ప్రతిఫలంగా భావిస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
ముంబైలో జన్మించిన మయాంక బాల్యమంతా తన తల్లిదండ్రులు రాసిన కథలు చదువుతూ గడిపింది. పుస్తకాలు, ప్రదర్శనలు, చలనచిత్రాలు ఆమె జీవితంలో భాగమయ్యాయి. 18 ఏండ్ల వయసులో తల్లి, అన్నయ్యను కోల్పోయింది. ఇది ఆమె జీవితంలో అత్యంత విషాద సంఘటన. ఆ దుఃఖం నుండి బయటకు వచ్చేందుకు రచనలను చేయడం మొదలు పెట్టింది. ‘ఎట్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్’ అనే ఓ నాటకాన్ని రాసింది. ఇది తన జీవిత ఆధారంగా రాసిన నాటకం. ఎన్ని రచనలు చేసినా మనం ఎంతో ప్రేమించే వ్యక్తులను వదులుకోవడం అంత సులభం కాదు అనే విషయాన్ని ఆమె అర్థం చేసుకుంది.
లోతైన అధ్యయనం ఉంటేనే
అవార్డు గురించి అడిగినప్పుడు మయాంక ”సైన్స్ అనేది మనం సినిమా, టీవీలో తరచుగా చూసే విషయం కాదు. మనం రాసేది ఏదైనా రీసెర్చ్ ఆధారిత కథగా ఉండాలి. అది లోతైన అధ్యయనం చేసినప్పుడు సాధ్యం. ఈ కథను రాయడం కోసం సైన్స్ నిపుణులతో ఎన్నో సమావేశాలు జరిపాను. అనేక చిత్తుప్రతులు ఎంతో శ్రమించాను. నా కష్టానికి ఇలా గుర్తింపు పొందడం ఆనందంగా ఉంది” అన్నది.
ప్రతిష్టాత్మక పోటీలలో…
మయాంకా టిస్చ్ ఫ్యూచర్ స్క్రీన్ రైటర్స్ ఫెలోషిప్ కూడా అందుకుంది. వారి గ్రాడ్యుయేట్ డ్రమాటిక్ రైటింగ్ ప్రోగ్రాం కోసం NYU టిస్చ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ స్కాలర్‌షిప్‌ను అందజేసింది. ఆమె 1497 ఫీచర్స్ ల్యాబ్, స్క్రీన్‌క్రాఫ్ట్ స్క్రీన్ రైటింగ్ ఫెలోషిరరరప్, ఫిల్మ్‌మాటిక్ స్క్రీన్‌ప్లే అవార్డ్స్ వంటి అనేక ప్రతిష్టాత్మక పోటీలలో స్థానం సంపాదించింది. ఆమె రికా ఞ సౌత్ ఏషియన్ రైటర్స్ కమిటీ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లో కూడా పాల్గొంటుంది. దానితో పాటు రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా నుండి స్క్రీన్ రైటర్స్ మార్గదర్శకత్వంలో తన పనిని మెరుగు పరుచు కుంటుంది. ప్రస్తుతం ఆమె భారతీయ టెలివిజన్‌లో చాలా అరుదుగా కనిపించే టీనేజ్ సిట్‌కామ్ కోసం పైలట్‌గా చేస్తుంది.
సీనియర్ క్రియేటివ్ లీడ్‌గా…
టెలివిజన్‌లోకి రాకముందు ఆమె డిజిటల్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ Schbang డిజిటల్ సొల్యూషన్స్‌లో సీనియర్ క్రియేటివ్ లీడ్‌గా మూడేండ్లు పనిచేసింది. అక్కడ ఉన్నప్పుడు మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఒక చలన చిత్రానికి స్క్రిప్ట్ రాసింది. ఇందులో తన్మరు భట్ (భారతదేశపు అత్యుత్తమ స్టాండప్ కామిక్స్‌లో ఒకటి), తనరు ఛేడా (ఆస్కార్ విజేత చిత్రం స్లమ్‌డాగ్ మిలియనీర్) నటించారు. ఆమె ఫెవికాల్ కోసం ప్రకటనలు కూడా చేశారు. ఇది భారతదేశంలోని అతిపెద్ద పురాతన బ్రాండ్‌లలో ఒకటి. ఈ ప్రకటనలకు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు కూడా అందుకుంది. డిజిటల్ పోస్ట్‌లు, యాడ్ ఫిల్మ్‌లతో సహా ఫెవికాల్ కోసం 60 ఏండ్ల ప్రచారానికి 80,000 డాలర్లు అందుకుంది.
గొప్ప అనుభవం ఉంది
30 లక్షలకు పైగా ఆన్‌లైన్ ఫాలోవర్లతో ఫొటోబ్లాగ్ హ్యూమన్స్ ఆఫ్ బాంబే కోసం మొట్టమొదటి షార్ట్ ఫిల్మ్‌లను రూపొందించడానికి కూడా ఆమె రైటింగ్ స్కిల్స్ ఉపయోగించారు. పిల్లలు వీటిని జంబుల్స్ అని పిలుస్తారు. ఆమె దాని కోసం ఒక యానిమేటెడ్ జింగిల్ రాసింది. దీని కంటెంట్ నుండి పోస్ట్-ప్రొడక్షన్ వరకు ప్రతిదీ పర్యవేక్షించింది. మయాంకకు వినోద రచనా రంగంలో గొప్ప అనుభవం ఉంది. ఆమె ఒక అద్భుతమైన రచయిత్రి. కష్టపడి పనిచేస్తోంది. ఆమె ఏది రాయాలనుకుంటే అదే రాస్తుంది. దాన్ని గడువులోగా పూర్తి చేస్తుంది. మయాంక విజయానికి అసలు కారణం ఇదే.
ఫీచర్లు రాసింది
మయాంక ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజ్ నుండి ఇంగ్లీష్ డిగ్రీ పూర్తి చేసింది. సోఫియా పాలిటెక్నిక్ నుండి జర్నలిజం, అడ్వర్టైజింగ్‌లో పీజీ డిప్లొమా పూర్తి చేస్తున్నప్పుడు ది హిందూ పత్రికలో ‘లైవ్స్ ఆఫ్ ది ఉమెన్ వాల్యూం 3’ కోసం అప్పుడప్పుడు ఫీచర్లు రాసింది. తర్వాత ఎరిన్, ఆరోన్ షోకు మొదటి సీజన్‌లో నికెలోడియన్‌లో షోరన్నర్ అసిస్టెంట్‌గా పనిచేసింది. స్లోన్ ఫౌండేషన్ ‘ది ఇమిటేషన్ గేమ్’, ‘ది మ్యాన్ హూ నో ఇన్ఫినిటీ’ వంటి పెద్ద ఉపన్యాసాలు, పరిశోధనలు, చిత్రాలకు మద్దతునిచ్చే ఒక అమెరికన్ ఎన్‌జీఓ.