స్త్రీలను గౌరవించడం ఎన్నవ ప్రాధమిక విధి?

Which primary duty is to respect women?1. ప్రాధమిక విధులకు సంబంధించి సరైన వాక్యం/ వాక్యాలు గుర్తించండి.
ఎ. వీటికి న్యాయ సంరక్షణ లేదు.
బి. కోర్టుల ద్వారా అమలు పరుచుకోడానికి వీలు కాదు.
సి. రాజ్యాంగ ప్రారంభంలోనే ప్రాథమిక విధులను 4(ఎ) భాగంలో పొందుపరిచారు.
1. ఎ మరియు బి. 2. సి మాత్రమే
3. ఎ మరియు సి 4. ఎ,బి,సి
2. ప్రాధమిక విధులను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించాము?
1. కెనడా 2. దక్షిణాఫ్రికా
3. అమెరికా 4. యుఎస్‌ఎస్‌ఆర్‌
3. క్రింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో 51ఎ అధికరణలో ప్రాధమిక విధులను పొందుపరిచారు?
1. 44వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 42వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 23వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 97వ రాజ్యాంగ సవరణ చట్టం
4. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి?
1. ప్రారంభంలో ప్రాథమిక విధుల సంఖ్య 10.
2. వర్మ కమిటీ సిఫార్సుల మేరకు ప్రాథమిక విధులు రాజ్యాంగంలో పొందుపరిచారు.
3. 1 మరియు 2 4. ఏదికాదు.
5. ”ప్రాధమిక విధులు కేవలం అలంకార పూర్వకమైనవి”
అని అభివర్ణించిన వారు?
1. డి.డి. బసు 2. హెచ్‌.జె. లాస్కి
3. నానీ ఫాల్కీవాలా 4. కె.పి. ముఖర్జీ
6. క్రింది ఏ రోజును ప్రాధమిక విధుల దినోత్సవంగా ప్రకటించాలని వర్మ కమిటీ సూచించింది?
1. జనవరి 9 2. జనవరి 26
3. నవంబర్‌ 26 4. జనవరి 3
7. దేశవ్యాప్తంగా అన్ని సినిమా హాళ్లల్లో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతం ప్రదర్శించాలని దాన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ నిలబడాలని సుప్రీంకోర్టు ఏ రోజున తీర్పునిచ్చింది.
1. 30 నవంబర్‌ 2016 2. 30 నవంబర్‌ 2018
3. 23 అక్టోబరు 2018 4. 23 అక్టోబరు 2017
8. ప్రాధమిక విధులు రాజ్యాంగంలో పొందుపర్చడం అనవసరం అని వ్యాఖ్యానించింది.
1. నానీ ఫాల్కీవాలా 2. డి.డి. బసు
3. సీకే దఫ్తరి 4. కె.పి. ముఖర్జీ
9. వర్మకమిటీ తన నివేదికను ఏ సం.లో ప్రభుత్వానికి అందించింది?
1. 1998 2. 1997
3. 1999 4. 1993
10. సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతం ప్రదర్శించడం తప్పనిసరి కాదని ఈ రోజున సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది?
1. 23 అక్టోబరు 2017 2. 9 జనవరి 2018
3. 26 నవంబరు 2018 4. ఏది కాదు.
11. ప్రాధమిక హక్కులు విధులు అనేవి ఒక నాణానికి వున్న బొమ్మా, బొరుసు వంటివి అని అభివర్ణించినవారు ఎవరు?
1. డి.కె. బారువ 2. హెచ్‌.జె. లాస్కి
3. డి. డి. బసు 4. సి.కె. దస్తరీ
12. ”6 నుండి 14 సం.ల మధ్య గల బాలబాలికలకు ప్రాధమిక విద్యను అందించడం తల్లిదండ్రుల బాధ్యత” ఈ విధి ఏ సం. నుండి అమల్లోకి వచ్చింది.
1. 2005 2. 2008
3. 2002 4. 2000
13. ప్రాధమిక విధులను తప్పనిసరిగా పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు క్రింది ఏ కేసులో తీర్పునిచ్చింది?
1. . NC V UOI 2. శతపతి Vర డాని
3. ఎ.కె. గోపాలన్‌ కేసు 4. కామన్‌ కాజ్‌ Vర ఖఉ×
14. ‘ఆదేశిక సూత్రాల అమలు ప్రభుత్వాల చిత్తశుద్ధిపై ఆధారపడినట్లయితే ప్రాధమిక విధులు పాటింపు అనేది కూడా పౌరుల చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుందని’ అభివర్ణించినవారు?
1. ఇందిరాగాంధీ 2. కె.పి. ముఖర్జీ
3. డి.డి.బసు 4. హెచ్‌.జె. లాస్కి
15. వర్మ కమిటీ సిఫార్సులకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించండి.
ఎ. ఉమ్మడి సంస్కృతిని గౌరవిస్తూ పరిరక్షించాలి.
బి. చిన్న చిన్న పుస్తకాలను ప్రచురించి ప్రాథమిక విధులను ప్రచారం చేయాలి.
సి. దూరదర్శన్‌, ఆకాశవాణి ద్వారా విధులను ప్రచారం చేయాలి.
1. ఎ మాత్రమే 2. బి మరియు సి
3. ఎ మరియు బి 4. ఏ.బి.సి
16. స్త్రీలను గౌరవించడం ఎన్నవ ప్రాధమిక విధి?
1.10 2. 8 3. 6 4. 5
17. క్రింది వాటిలో సరైన గుర్తించండి.
ఎ. ప్రాధమిక విధులకి సంబంధించిన బిల్లుని పార్లమెంటులో హెచ్‌ ఆర్‌ గోఖలే ప్రవేశపెట్టారు.
బి. స్వరణ్‌ సింగ్‌ కమిటీ పది ప్రాథమిక విధులను సూచించింది.
1. ఎ మాత్రమే 2. బి మాత్రమే
3. ఎ. బి 4. ఏది కాదు.
18. క్రింది వాటిలో సరి కాని జతను గుర్తించండి..
1. అటవీ సంరక్షణ చట్టం 1980.
2. పౌరహక్కుల పరిరక్షణ చట్టం 1976
3. నీటి కాలుష్య నివారణ నియంత్రణ చట్టం 1972
4. పై ఏది కాదు.
19. ప్రాధమిక విధులు అమలుకు భారత ప్రభుత్వం రూపొందించిన జాతీయ గౌరవాలను అగౌరవపరుచుటను నివారించు చట్టం ఏ సం. లో చేశారు?
1 1972 2. 1971
2 1951 4. 1974
20. ప్రాధమిక విధులు ఏ సం. నుండి అమల్లో
వచ్చాయి?
1 1977 2. 1978
2. 1974 4. 1985
21. ప్రాధమిక విధులు అసంబద్ధంగా మరియు గందరగోళంగా ఉన్నాయి అని వ్యాఖ్యానించింది?
1. సి.కె. దఫ్తరీ 2. నానీ ఫాల్కీవాలా
3. ఇందిరాగాంధీ 4. హెచ్‌.జె. లాస్కీ
22. 6-14 లోపు బాలబాలికలకు సంబంధించిన నిర్భంద విద్యకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది?
1. 81వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 97వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 86వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 91వ రాజ్యాంగ సవరణ చట్టం
23. క్రింది వాటిలో స్వరణ్‌ సింగ్‌ సిఫార్సులలో వేటిని ప్రాథమిక విధులలో చేర్చలేదు.
ఎ. సకాలంలో పన్నులు చెల్లించుట
బి. ప్రాథమిక నిధులు పాటించని వారిపై చర్యలు.
1. ఎ మాత్రమే 2. బి మాత్రమే
3. ఎ, బి 4. ఏదీ కాదు
24 అన్ని విద్యాసంస్థల్లో ప్రాధమిక విధులు అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని ఏ కమిటీ సూచించింది?
1. సప్రూ కమిటీ 2. రంగరాజన్‌ కమిటీ
3. స్వరణ్‌ సింగ్‌ కమిటీ 4. వర్మ కమిటీ
25. జతపరుచుము.
చట్టం సంవత్సరం
ఎ. వన్యప్రాణి రక్షణ చట్టం 1. 1951
బి. జాతీయ గౌరవ చిహ్నాల గుర్తింపు చట్టం 2. 1980
సి. అటవీ పరిరక్షణ చట్టం 3. 1986
డి. పర్యావరణ పరిరక్షణ చట్టం 3. 1972
1. ఎ4, బి3, సి2, డి1 2. ఎ1, బి2, సి3, డి4
3. ఎ4, బి1, సి2, డి3 4. ఎ4, బి2, సి1, డి3
26. ఈ క్రింది వాటిలో ప్రాధమిక విధి కానిది ఏది?
1. జాతీయ సేవలో పాల్గొనాలి.
2. దేశ సార్వభౌమాధికారము సమగ్రతను పరిరక్షించాలి.
3. ప్రభుత్వ అస్తులను పరిరక్షించాలి.
4. ప్రపంచ శాంతికి కృషి చేయాలి.
27. ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 10 ప్రాధమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు?
1. 86వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 25వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 42వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 44వ రాజ్యాంగ సవరణ చట్టం
సమాధానాలు
1.1 2.4 3.2 4.1 5.4 6.4 7.1 8.3 9.3 10.1 11.2 12.3 13.1 14.3 15.2
16.4 17.1 18.3 19.2 20.1 21.2 22.3 23.3 24.4 25.3
26.4 27.3
డాక్టర్‌ అలీ సార్‌, 9494228002
భారత రాజ్యాంగ నిపుణులు