ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లపై స్పందించండి

– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ : ట్రాన్స్‌జెండర్లకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రం, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. వారికి రిజర్వేషన్లపై స్పందన తెలియచేయాల్సిందిగా ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 16 (ప్రభుత్వ ఉద్యోగ విషయాల్లో సమానత్వం) ప్రకారం ట్రాన్స్‌జెండర్లు రిజర్వేషన్‌కు అర్హులని నొక్కి చెప్పిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ జెబి పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మా సనం శుక్రవారం ఈ నోటీసులు జారీ చేసింది. యునై టెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (యూఎన్‌డీపీ) సహకారంతో నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (నాకో) నివేదికపై కేరళకు చెందిన సుబి కెసి అనే ట్రాన్స్‌జెండర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మా సనం విచారించింది. ట్రాన్స్‌జెండర్లకు (లింగ మార్పిడి వ్యక్తుల కు) తగినంత శిక్షణ, ఉపాధి నైపుణ్య కార్యక్రమాలు లేక పోవడం వల్ల ఈ అట్టడుగు వర్గానికి ఉపాధి అవకాశాలు లేవని ఈ నివేదిక సూచించింది. ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) చట్టం-2019 లింగమార్పిడి వ్యక్తులకు వివిధ హక్కులను మంజూరు చేసినప్పటికీ, అది విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్‌లను అందించడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతే కాకుండా, పిటిషన ర్లు కోరినట్లుగా ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టులలో అనేక రిట్‌ పిటిషన్లు దాఖల య్యాయని పిటిషన్‌ స్పష్టం చేసింది. అయినప్పటికీ, లింగమార్పిడి వ్యక్తులకు అటు వంటి రిజర్వేషన్లను నిర్ధారించడానికి ఇంతవ రకు ఎటువంటి ఖచ్చితమైన చర్యలు తీసుకో లేదని పేర్కొంది. అదనంగా, లింగ మార్పిడి వర్గం సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరం గా వెనుకబడి ఉందని అనేక అధ్యయనాలు, నివేదికలు నిరూపిస్తున్నాయని పిటిషన్‌ పేర్కొంది. రిజర్వేషన్ల కోసం నిబంధనలను అమలు చేయడంతో వారి విపత్కర పరిస్థి తులను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ పిటిషన్‌ను న్యాయవాది తులసి కె రాజ్‌ డ్రా చేయగా, న్యాయవాది కాళేశ్వరం రాజ్‌ సెటిల్‌ చేశా రు. న్యాయవాది మహమ్మద్‌ సాదిక్‌ టిఎ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.