నిరుపయోగ వస్తువుల సేకరణకు స్పందన…

– మున్సిపల్ చైర్మన్: గంగాధర్
నవతెలంగాణ – నసురుల్లాబాద్
ఇళ్లల్లోని పనికిరాని వస్తువుల సేకరణ కోసం మున్సిపాలిటీ వారు చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌కు నగరవాసుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ గంగాధర్ తెలిపారు. శనివారం బాన్సువాడ పట్టణంలో త్రిబుల్ ఆర్ ( రెడ్యూస్ రియూజ్ రీసైకిల్) సెంటర్ ను మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గంగాధర్ మాట్లాడుతూ..  ఇండ్లలో పాత వస్తువులు, పుస్తకాలు, చెప్పులు, ఆట బొమ్మలు, దుస్తులు, ప్లాస్టిక్ వస్తువులు, నిరూప యోగంగా ఉండే వస్తువులను మున్సిపల్ వారు ఏర్పాటు చేసిన సెంటర్ లో అందజేయాలని సూచించారు. నేటి నుండి వచ్చే నెల 5 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. తమ ఇళ్లలో ఉన్న నిరుపయోగ వస్తువులను ఎక్కడ వేయాలో తెలియక, ఇంట్లో ఉంచుకోలేక ఇబ్బందులు పడుతున్న నగరవాసులు ఈ సదుపాయాన్ని ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఇంటికే వచ్చి ఆయా వస్తువులను బల్దియా సేకరిస్తుండడంతో ఎన్నో ఏళ్ల నుండి తమ ఇళ్లలో ఉన్న నిరుపయోగ వస్తువులను పెద్ద ఎత్తున అందజేస్తున్నారని అన్నారు. వచ్చే 5వ తేదీ వరకు జరిగే ఈ డ్రైవ్‌లో ఇళ్లలో వృథాగా ఉన్న పాత వస్తువులు, కూలర్లు, పరుపులు, మెత్తలు, పనిచేయని ఎలక్ట్రానిక్‌ వస్తువులు, విరిగిన కుర్చీలతో పాటు పనికిరాని ఏ వస్తువునైనా ఇచ్చేయవచ్చున్నారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్,పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.