– మహిళా ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి
– జిల్లా వైద్యాధికారి బానోతు కళావతి భాయ్
నవతెలంగాణ – దంతాలపల్లి
మహిళల ఆరోగ్యం పట్ల ఆశ్రద్ధ వహించకుండా వైద్య సేవలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని జిల్లా వైద్యాధికారి బానోతు కళావతి భాయ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఆరోగ్య శ్రేయసే కర్తవ్యం గా ప్రతి మహిళల పట్ల ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమం నిర్వహణ సక్రమ రితిలో జరగలేదని, మహిళలకు వైద్య పరీక్షలు ఉత్తీమాటేనా అనే కథనం నవతెలంగాణ దినపత్రికలో శనివారం ప్రచురితమైన కథనానికి స్పందించిన జిల్లా వైద్యాధికారి బానోతు కళావతి భాయ్. హాస్పటల్లో మందుల నమోదు రిజిస్టర్లను , పరిశీలించి 4105 బ్యాచ్ నెంబర్ లో గల ఆర్ ఎల్ బాటిల్ను తనిఖీ చేశారు 2020 ఆర్థిక సంవత్సరం నుంచి 2024 మే 13 వరకు పంపిణీ చేసిన స్టాక్ రిజిస్టర్ ని తనిఖీ చేయగా 4105 ఆర్ ఎల్ సెలూన్ బాటిల్ తమ ఆసుపత్రిది కాదని మీడియాకు తెలియజేశారు. ఆర్ ఎల్ లీకేజీతో ఫంగస్ వ్యాపించి అనారోగ్యానికి కారణమైన మందులపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.
నవతెలంగాణ కథనానికి స్పందన
ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వచ్చిన పేషెంట్లను నిబంధనల ప్రకారం టెస్టులు చేసి సంబంధించిన మందులు సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. రోజువారి వస్తున్న ఓపి సంఖ్యను పెంచాలనీ, నాణ్యత ప్రమాణాలతో వైద్య పరీక్షలు సేవలు అందించాలని, వ్యాధులు ఆర్థికంగా మానసికంగా నష్టపరుస్తాయని, సమస్యలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, రోగుల పట్ల మర్యాదగా ఉండాలని సమస్యలు తలెత్తకుండా చూడాలని కళావతి భాయ్ అన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబానికి పెద్ద ఆసరుగా ఉంటుంరాని , ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, వైద్యాధికారులు పరీక్షించి టెస్టులు రాసిన యెడల తప్పనిసరిగా చేయించుకోవాలని, క్రమం తప్పకుండా మందులు వాడాలని ఆమె సూచించారు. వైద్యాధికారులు ఆరోగ్య మహిళ కార్యక్రమంపై విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. నిర్లక్ష్యంగా పనిచేసిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని వైద్యాధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ అంబరీష, జిల్లా పబ్లిక్ హెల్త్ నర్స్ ఆఫీసర్ కే మంగమ్మ, మండల వైద్యాధికారి చైతన్య, సి హెచ్ ఓ బాలాజీ నాయక్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.