నవతెలంగాణ కథనానికి స్పందన

– చెరువు విస్తీర్ణం పరిశీలన
నవతెలంగాణ – దంతాలపల్లి
మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామంలో కబ్జాకి గురవుతున్న కుమ్మరికుంట్ల పెద్ద చెరువు, మట్టి పోసి చెరువును ఆక్రమిస్తున్న రైతులు శీర్షికతో నవతెలంగాణలో మంగళవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఈ బి. వినయ్, ఏ ఈ మౌనిక, కుమ్మరికుంట్ల పెద్ద చెరువు ప్రాంతాన్ని మంగళవారం పరిశీలించారు. రెవెన్యూ దస్తాల ప్రకారం చెరువు విస్తీర్ణం ఎంత ఉందనే విషయాన్ని తెలుసుకున్నారు. త్వరలో సర్వే కొలతలు వేయించనున్నట్లు డి ఈ బి.వినయ్ తెలిపారు. అనంతరం చెరువులో మట్టిని తోడి కట్ట పోసిన ప్రాంతాన్ని పరిశీలించారు. మట్టితో కట్టలు పూసిన వాటిని తొలగించినట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట ఏఈ మౌలిక, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు చిల్ల సహదేవ్, మత్స్య శాఖ ఉపాధ్యక్షులు బత్తిని మల్లయ్య, ముదిరాజ్ సంఘం నాయకులు చిల్ల వీరేష్, అశోక్, సత్తయ్య, బత్తిని వీరేష్, ఏడెల్లి సత్తయ్య, తదితరులు ఉన్నారు.