నవతెలంగాణ-గోవిందరావుపేట
ఉద్యోగ విరమణ అనేది ఉద్యోగంలో ఒక చివరి ఘట్టం మాత్రమే అని జీవితానికి కాదని పసర సిఐ శంకర్ అన్నారు. సోమవారం మండలంలోని పసర పోలీస్ స్టేషన్ లో ఏ ఎస్ ఐ గాజుల సత్యనారాయణ ఉద్యోగ విరమణ కార్యక్రమం ఎస్ ఐ కమలాకర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిఐ శంకర్ హాజరై మాట్లాడుతూ గాజుల సత్యనారాయణ దాదాపు 34 సంవత్సరాలు పోలీసు డిపార్ట్మెంట్లో వివిధ హోదాలలో పనిచేసి నేడు ఏ ఎస్ ఐ గా ఉద్యోగ విరమణ చేయడం గమనార్హం అన్నారు. ఇంతకాలం కేవలం స్టేషన్ కే పరిమితమైన సత్యనారాయణ ఇకముందు సమాజానికి పూర్తిస్థాయిలో తన సమయాన్ని కేటాయించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగ విరమణ కార్యక్రమానికి బంధుమిత్రులు పోలీస్ సిబ్బంది అందరూ హాజరు అయి ఏఎస్ ఐ సత్యనారాయణ తో తమకున్న అనుబంధం గురించి స్టేజి మీద పంచుకున్నారు. ఈ సందర్భంలో అమెరికా లో ఉన్న ఏఎస్సై సత్యనారాయణ కుమారుడు ఆన్లైన్ లోకి అందుబాటులోకి రాగా కార్యక్రమం అంతయూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించటం జరిగింది. చివరగా ఏఎస్ ఐ సత్యనారాయణ మాట్లాడుతూ భావోద్వేగానికి గురి కావటం జరిగింది. చివర్లో ఏఎస్ ఐ ని ప్రభుత్వ వాహనం లో లాంఛనం గా సాగనాంపటం జరిగింది.