టీపీసీసీ అధికార ప్రతినిధులుగా నియమించిన రేవంత్‌

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు, పార్టీ వాయిస్‌ను ప్రజలకు చేరవేసేందుకు టీపీసీసీ అధికార ప్రతినిధులను కాంగ్రెస్‌ నియమించింది. ఈమేరకు బుధవారం పార్టీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి 31 మంది అధికార ప్రతినిధుల జాబితాను విడుదల చేశారు. ఇద్దరు మీడియా సమన్వయకర్తలను నియమించారు. అధికార ప్రతినిధుల్లో సీనియర్లు, జూనియర్లు కూడా ఉన్నారు. కత్తి వెంకటస్వామి, శ్రీరంగం సత్యం, కొనగాల మహేష్‌, జి హర్షవర్థన్‌రెడ్డి, నిజామెద్దీన్‌, పాల్వాయి స్రవంతిరెడ్డి, బండి సుధాకర్‌గౌడ్‌, సామ రామ్మోహన్‌రెడ్డి, కత్తి కర్తీకా గౌడ్‌, దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు : కొనగాల
తనపై నమ్మకంతో పార్టీ నాయకత్వం అప్పగించిన బాధ్యతను చిత్తశుద్దితో నిర్వర్తిస్తానని కొనగాల తెలిపారు. తన నియామకానికి సహకరించిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, డాక్టర్‌ కొనగాల మహేష్‌ ఏఐసీసీ సభ్యులుగా, టీపీసీసీ అధికార ప్రతినిధిగా, మీడియా కమిటీ కన్వీనర్‌గా, మాస్టర్‌ ట్రైనర్‌గా, పార్టీ ప్రచార కమిటీ సభ్యులుగా వివిధ హోదాల్లో పార్టీకి సేవలు అందించారు.