రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

నవతెలంగాణ- కోటగిరి: కాంగ్రెస్ పార్టీ లో  అలుపు ఎరగని   పోరాటం చేస్తూ బాన్సువాడ నియోజకవర్గంలో కాసుల బాలరాజ్  కాంగ్రెస్ పార్టీని కాపాడుతూ నేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా స్థానికేతరలను నియమించడంతో పురుగుమందు సేవించి ఆసుపత్రి పాలైన కాసుల బాలరాజు వెంటనే కోలుకోవాలని కోరుకుంటూ , దీనికి కారణమైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను గురువారం కోటగిరి మండల కేంద్రంలో బీసీ వర్గానికి చెందిన నాయకులు ఆనంద్, రాజు, పీరయ్య తదితరులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు.