– కాంగ్రెస్ మండల అధ్యక్షులు భూత శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ – వీర్నపల్లి
అసాధ్యమన్న రుణమాఫీని సుసాధ్యం చేసిన ఘనుడు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలో రైతు వేధికలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా రైతులతో కలిసి ఆనందోత్సవాల మధ్య సంబరాలు జరిపారు. అనంతరం ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు భూత శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చుతూ ప్రజా పాలన కొనసాగిస్తుందన్నారు. గత పది సంవత్సరాలుగా రైతులు రాక్షస పాలన చూశారని, అబద్ధపు మోసపూరిత హామీలతో 10 సంవత్సరాలుగా ప్రజలకు గత ప్రభుత్వం ఏం మార్చిందని, రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారన్నారు. ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల వ్యవధిలోనే రైతు కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలని ఆలోచనతో ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలోని 1295 మంది రైతు కుటుంబాలకు మొదటి విడతగా రుణమాఫీ జరిగిందని అన్నారు. మరో రెండు ధఫాలుగా రుణమాఫీ ఉంటుందని తెలిపారు. రానున్న రోజుల్లో గొప్ప గొప్ప సంస్కరణలు కాంగ్రెస్ పార్టీ తీసుకురాబోతుందని ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వంతో మమేకమవుతూ ప్రజా పాలనను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం టపాసులు పేల్చి కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు, సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రాములు నాయక్, మండల ఉపాధ్యక్షులు శివరామకృష్ణ, యూత్ మండల అధ్యక్షులు తిరుపతి యాదవ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్, పార్లమెంట్ కోఆర్డినేటర్ గజన్ లాల్ నాయక్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు లెంకల రాజు, బీసీ సెల్ మండల అధ్యక్షుడు బోనాల శ్రీనివాస్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రవీందర్, మండల కోఆర్డినేటర్ నక్క శ్రీనివాస్, వీర్నపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు చంద్రమౌళి, నాయకులు దినాకర్,సంతోష్, నాగరాజు,కాంతయ్య,కుమార్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.