బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన లో ఆలయాలకు పునర్వైభవం.

 నవతెలంగాణ- చివ్వేంల: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన లో ఆలయాలకు పునర్వైభవం వచ్చిందని, రాష్ట్రం లో అన్ని మతాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ వారి వారి మత ఆచారాలకు అనుగుణంగా ప్రభుత్వ మే పండుగలను నిర్వహించిన ఘనత దేశం లో కేసీఆర్  ప్రభుత్వానిది  మాత్రమే అని సూర్యాపేట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బొడ్రాయి పండుగ  నిర్వచనం అన్నారు. గురువారం మండలంలోని మోదిన్ పురం  గ్రామంలో కన్నుల పండుగగా సాగుతున్న  బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవం లో పాల్గొన్న  జగదీష్ రెడ్డి   ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జగదీష్ రెడ్డి  మాట్లాడుతూ.. బొడ్రాయి అనేది గ్రామ దేవతలకు ప్రతినిధి అన్నారు. ఊరి భౌగోళిక పరిమాణం, ఊరి నిర్మాణం పైన ప్రజలందరికి  అవగాహన కల్పించడం కోసమే ఈ పండుగ చేస్తారని, ప్రతి  ఒక్కరు తమ తమ మత ఆచారాల కు అనుగుణంగా దైవ చింతన ను కలిగి ఉండాలని తద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందని  అన్నారు.  ఊరిలోని వారంతా కలిసి ఐక్యమత్యంగా ఉండాలని ఊరి బాగు కోసం ప్రతి ఒక్కరు ఆలోచించాలనేది దీని వెనక ఉన్న ప్రధాన ఆంతర్యం అని అన్నారు. తెలంగాణ రాష్టం ఏర్పడ్డాక అన్ని మతాల కు, కులాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ, ప్రభుత్వమే   స్వయంగా అన్ని పండుగలను నిర్వహించడం దేశం లో మరెక్కడా లేదన్నారు. ఇదంతా  తెలంగాణ ప్రజల పై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న   ప్రేమ అని కొనియాడారు.  గ్రామాల్లో సంస్కృతి, సంప్రదాయాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని  సూచించారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ నంద్యాల జనార్దన్ రెడ్డి, ఎంపీటీసీ నూకల రేణుక రమేష్, ఉట్కూరి సైదులు,  బొడ్రాయి నిర్వహణ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు..