ఆర్జీ-3 & ఏపీఏ ఏరియా ల్లో పర్యటించిన డైరెక్టర్లు 

నవతెలంగాణ-రామగిరి
సింగరేణి రామగుండం-3 & అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాల్లో  డైరెక్టర్ లు( ఆపరేషన్స్)  ఎన్ వి కె శ్రీనివాస్, ( ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) జి వెంకటేశ్వర్ రెడ్డి లు మంగళవారము పర్యటించారు. ముందుగా వారు ఏఎల్ పి గనిలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి ఉత్పత్తి, ఉత్పాదకత, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు. అనంతరం ఆర్ జి కోల్ మైన్ పనుల్లో భాగంగా చేపట్టనున్న  పనులను, ఓసిపీ -2 ఉపరితల గనినీ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ఏఎల్ పి, ఓసీపీ -2 గనులలో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించుట కొరకు తీసుకోవలసిన చర్యల గురించి సంబంధిత అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. అలాగే ఆర్ జీ కోల్ మైన్ పనులను త్వరగా  పూర్తి చేసే విధంగా తగిన చర్యలను, ప్రణాళికలను రూపొందించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో వారితోపాటు సేఫ్టీ జిఎం( కార్పొరేట్) కె గురవయ్య,  ఆర్జీ-3 జిఎం ఎన్. సుధాకర రావు, ఆర్ జి రీజియన్ సేఫ్టీ జిఎం ఎస్. సాంబయ్య, ఎస్ఓటు జిఎం ఏపీఏ డి బైద్య, ప్రాజెక్ట్ అధికారులు ఎన్ రాధాకృష్ణ, కె నాగేశ్వరరావు,  కె రాజేందర్, ఏరియా సర్వే అధికారి జైనుల్ల బద్దిన్, సివిల్ డీజీఎం పద్మరాజు, ఏరియా సెక్యూరిటీ అధికారి ఈ లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.