– బాసర స్నాతకోత్సవం
– ముఖ్యఅతిథిగా మంత్రి సబిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) బాసర ఆరో స్నాతకోత్సవ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లోని బ్రహ్మకుమారిస్ ఆడిటోరియంలో జరగనుంది. ఈ మేరకు ఆర్జీయూకేటీ బాసర వీసీ ప్రొఫెసర్ వి వెంకటరమణ హైదరాబాద్‌లో తనను కలిసిన విలేకర్లతో మాట్లాడుతూ ఈ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, గౌరవ అతిథిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం, ప్రత్యేక అతిథులుగా ఐఏఎస్ అధికారులు జయేష్ రంజన్, వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, ఈసీ సభ్యులు ప్రొఫెసర్ కృష్ణారెడ్డి పాల్గొంటారని చెప్పారు.