కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం..

– తీవ్రంగా నష్టపోతున్న రైతులు..
– వెంటనే కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో డీఎస్ఓ కు వినతి పత్రం
నవతెలంగాణ సిరిసిల్ల
కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై నెలలు గడుస్తున్న రైతులకు సంబంధించిన వరి ధాన్యం ఎక్కడ దాన్యం అక్కడే ఉందని కొనుగోలు కేంద్రాల నిర్లక్ష్యంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ బృందం శుక్రవారం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వారం రోజులుగా జిల్లా సిపిఐ ప్రదిని బృందం కొనుగోలు కేంద్రాలను సందర్శించడం జరిగిందని ఈ సందర్భంగా చాలామంది రైతులు వారి సమస్యలను సిపిఐ బృందం దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు నెలలు గడుస్తున్న కొనుగోలు కేంద్రాలలో పూర్తిస్థాయి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని తగు స్థాయిలో లారీలు పంపకపోవడం ఒక కారణంగా చెప్తున్నారని అన్నారు. తగిన సమయంలో కొనుగోలు కేంద్రాలు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతాంగం తీవ్ర నష్టం పోతుందని రైతుల కుటుంబాలని సొసైటీ కేంద్రాల్లో ఉంటూ ధాన్యాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు దీని మూలంగా రైతులు విసిగిపోయి అడ్డగోలు తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు రెండు వేల పైచిలుకు ఉన్న ప్రభుత్వ మద్దతు ధర ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో విసిగిపోయి ఉన్న రైతులు 15 వందలకు 1600కే ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు ఇది సొసైటీలు ఐజేపి కేంద్రాలు కొనుగోలు విషయంలో ఆలస్యం చేయడం వల్లే ఇదంతా జరుగుతుందని ఆరోపించారు వెంటనే కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని సరిపడా చేయడానికి తగినని లారీలను పంపాలని జిల్లా సరఫరాల శాఖ అధికారికి విన్నవించారు. కొన్ని కేంద్రాలలో ఒక్కొక్క ధాన్యం బస్తా కు రెండు రూపాయలు అదనంగా ఇవ్వాలని లారీ యజమానులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారికి వివరించారు ఇది ఒక రకంగా రైతాంగాన్ని దోపిడీ చేయడమేనని అన్నారు వెంటనే కొనుగోలు సెంటర్లను పరిశీలించి అధిక డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు అమ్ముకున్న ధాన్యం డబ్బులు కూడా ప్రభుత్వం వెంటనే ఇవ్వడం లేదని ఆలస్యం కావడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దీని మూలంగా మళ్ళీ పొలం పనులకు వివిధ అవసరాల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారాలు ఆశ్రయించాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడిందన్నారు. వీర్నపల్లి మండలానికి సంబంధించిన కొందరు రైతులు ముస్తాబాద్ మండలం కు చెందిన రాఘవేంద్ర రైస్ మిల్ కు ధాన్యాన్ని అమ్ముకోగా యాజమాన్యం ఫేమస్ శాతం ఎక్కువ ఉందని కారణాల సాకుతో 10 కిలోల తరుగు చేయాలని యాజమాన్యంపై ఒత్తిడి చేసి బెదిరింపులకు పాల్పడ్డట్లు తమకు దృష్టికి వచ్చిందని తెలిపారు రైతులను దోపిడికి గురి చేస్తున్న రాఘవేంద్ర రైస్ మిల్లు తక్షణమే చర్యలు తీసుకొని సీజ్ చేయాలని కోరారు తరుగు పేరుతో దోపిడీ చేస్తే ఆ రైస్ మిల్లులన్నింటిని సీజ్ చేయాలని, నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. రైస్ మిల్లర్లు దోపిడి పద్ధతులు మారకపోతే జిల్లావ్యాప్తంగా దోపిడికి గురైన రైతు లను ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు కార్యవర్గ సభ్యులు పంతం రవి మీసం లక్ష్మణ్ సోమ నాగరాజు వడ్డేపల్లి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.