అధికారుల అండతో రైతులను దోపిడీ చేస్తున్న రైస్ మిల్లర్లు

– సిపిఐ పట్టణ కార్యదర్శి పంతం రవి
నవతెలంగాణ – సిరిసిల్ల
అధికారుల అండ చూసుకొని రైస్ మిల్లర్లు రైతులను దోపిడీ చేస్తున్నారని సిపిఐ సిరిసిల్ల పట్టణ కార్యదర్శి పంతం రవి ఆరోపించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అర్బన్ మండల లో గల వరి ధాన్యపు కొనుగోలు సెంటర్లను శనివారం సిపిఐ బృందం సందర్శించారు. ఈ సందర్భంగా పంతం రవి మాట్లాడుతూ యాసంగి ధాన్యం సేకరణ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈసారి నామమాత్రంగా కొనసాగుతుందని ఇప్పటికే అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, నష్ట పొంగ మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు సెంటర్లో అమ్ముకుందామంటే కొనుగోలు ప్రక్రియ సవ్యంగా జరిగాక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అధికారులు అండ చూసుకొని రైస్ పిల్లర్లు రైతులను అధిక దోపిడీ గురి చేస్తున్నారని అన్నారు. ఒక ధాన్యం బస్తా 40 కిలోలు తూకం వెయాల్సి ఉండగా 42 కిలోల చొప్పున తూకం వేస్తున్నారని ఫలితంగా రైతులు ఒక క్వింటాలకు ఆరు కిలోల నుండి ఎన్ని కిలోలు నష్టపోతున్నారని అన్నారు. తూకం ఎక్కువ వేయడాన్ని ప్రశ్నిస్తున్న రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం లారీ లేవని సాకులు చెప్పడం జరుగుతుందని తమ దృష్టికి వచ్చిందని అన్నారు. గత్యంతరం లేక రైతులు అదనపు తూకానికి ఒప్పుకుంటున్నారని, ఈ విషయంపై ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకుని రైస్మిల్ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సోమ నాగరాజు, అజ్జ వేణు, వడ్డేపల్లి లక్ష్మణ్, అర్జున్, తదితరులు పాల్గొన్నారు.