అంగవైక్యలం కలిగినవారి హక్కుల కోసం, సంక్షేమం కోసం 1992 నుండి డిసెంబరు 3ను అంతర్జాతీయ వికలాం గుల దినోత్సవంగా పాటిస్తున్నారు. వికలాంగులను అందరితో కలుపుకోవడం, ఉనికిని ఆమోదించడం, వారి ప్రాతినిధ్య ప్రాధా న్యతను ప్రముఖంగా చూపడమే దీని లక్ష్యం. ”వికలాంగుల కోసం, వారి ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఐక్య కార్యాచరణ” అన్నది ఈ ఏడాది థీమ్‌గా వుంది. ఐక్య రాజ్యసమితిలో ఈ డిసెంబరు ఒకటిన జరిగిన కార్యక్రమంలో ప్రధానంగా ‘శాంతి’పై దృష్టి కేంద్రీకరిస్తూ చర్చలు జరిగాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఏ ఒక్కదాన్నైనా సాధించే దిశగా పురోగమించేందుకు తప్పనిసరిగా వుండాల్సిన ముఖ్యమైన అంశం ‘శాంతి’ అని ఆ కార్యక్రమంలో నొక్కి చెప్పారు. దీర్ఘ కాలంగా నలుగుతూ, శాంతియుత పరిస్థితులకు ప్రధాన అవరో ధంగా నిలిచిన వివిధ ఘర్షణల్లో ఒకటి పాలస్తీనా ఆక్రమణ సమస్య-ఇజ్రాయిల్ విస్తరణ.
1948లో ఇజ్రాయిల్‌ను ఏర్పాటు చేసేందుకు లక్షలాది మంది ప్రజలను నిర్వాసితులను చేశారు. ఆక్రమణ దారులు పాలస్తీనా భూభాగంలో ప్రధాన భాగాలను నిర్దాక్షిణ్యంగా ఆక్ర మించుకోవడమే కాకుండా పాలస్తీనియన్ల మౌలిక మానవావ సరాలను, వారి గౌరవాన్ని, హక్కులను, స్వేచ్ఛలను అన్నింటినీ హరించివేస్తూ వారిపై చెప్పరాని భారాలను మోపారు. పాల స్తీనా ప్రజలు మాత్రం ఇజ్రాయిల్ ఆక్రమణకు వ్యతిరేకంగా తమ మాతభూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం కోసం సుదీర్ఘంగా పోరాడుతూనే వున్నారు. ఇజ్రాయిల్ దాడుల పర్యవసానంగా పాలస్తీనాలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోతూ, తీవ్ర గాయా లపాలవుతుండడం దారుణం. అక్టోబరు 7న హమాస్ దాడు లకు ప్రతిస్పందనగానే నేటి ఘర్షణలు, యద్ధమని కొందరు భావించినప్పటికీ ప్రస్తుతం జరుగుతున్నది ఎంతమాత్రమూ సముచితం కాదు. అప్పటి నుండి నేటి వరకు నిర్దాక్షిణ్యంగా 15 వేల మంది ప్రాణాలు తీశారు.
అత్యంత దారుణంగా అమలవుతున్న ఈ ఆటవిక కార్యకలా పాల్లో మహిళలను, పిల్లలను, వికలాంగులను, రోగులను కూడా వదిలిపెట్టలేదు. మరణించిన 15 వేల మందిలో 6,150 మంది పిల్లలే. వీరిలో నవజాత శిశువులు కూడా వున్నారు. గాజా స్ట్రిప్ ”చిన్నారుల సమాధి’గా మారిందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. మరో 242 మంది (వీరిలో 57మంది పిల్లలే) ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో జరిగిన దాడుల్లో మరణించారు. గాజాలో దాదాపు 36 వేల మంది (వారిలో 75శాతం పిల్లలు, మహిళలు), ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో 2,750 మంది తీవ్రంగా గాయపడ్డారు. అంతిమంగా ఈ గాయాలు అంగవైకల్యానికి దారి తీయవచ్చు. అయితే, పాలస్తీనా నుండి వెలువడిన ఈ గణాంకాల్లో వికలాంగులకు జరిగిన ప్రాణనష్టాలను నమోదు చేయలేదు. యావత్ పాలస్తీనా జనాభాను తుడిచిపెట్టే లక్ష్యంతో జరుగుతున్న ఈ దాడుల పర్యవసానంగా వికలాంగులుగా మారిన వారి సంఖ్యను కూడా లెక్కించలేదు. పాలస్తీనాలో ఇప్పటికే వికలాంగులైన వారి సంఖ్య ఎక్కువ. నిరంతరంగా కొనసాగుతున్న ఇజ్రాయిల్ దాడులు, యుద్ధ నేరాలు ఇప్పటికే అనేక మందిని పొట్టనబెట్టుకున్నాయి. ప్రాథమిక పాఠశాలలకు వెళ్ళే వయస్సు కలిగిన పిల్లల్లో (5-17 సంవత్సరాలు)15 శాతం మందికి అంగవైకల్యం వుందని పాల స్తీనా సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (పిసిబిఎస్, 2020) అం చనా వేసింది. వీరిలో వెస్ట్‌బ్యాంక్‌లో 17 శాతం మంది వుండగా, గాజాలో 13 శాతం మంది వున్నారు. మానసిక వైకల్యాలతో బాధపడుతున్న వారి సంఖ్యను ఇందులో చేర్చలేదన్నది గుర్తుం చుకోవాల్సిన అంశం. జనాభాలో పెద్ద సంఖ్యలో ప్రజలను ప్రభా వితం చేస్తున్న తీవ్రమైన సమస్యగా దీన్ని భావిస్తున్నారు.
ఇతరులతో పోల్చుకుంటే వికలాంగులను ఈ యుద్ధం (ఘర్షణలు) మరింతగా ప్రభావితం చేస్తున్నదని చెప్పకపోయినా జరుగుతున్నదదే. వీరు ప్రాణాలను కాపాడుకోవడం కూడా మారవచ్చు. వైకల్యాన్ని మరింత దిగజార్చ వచ్చు. లేదా కొత్త వైకల్యాలకు దారి తీయవచ్చు. మొత్తమ్మీద సమాజంలో పక్కకు నెట్టివేయడానికి లేదా నిర్లక్ష్యం చేయడానికి దారితీసేలా ప్రభా వితం చేస్తుంది. సాధారణ ప్రజలతో పోలిస్తే వికలాంగులపై ఘర్షణల ప్రభావం అనేక రకాలైన పర్యవసానాలకు దారి తీ స్తుంది. ఇందుకు వివిధ వ్యవస్థాగతమైన, పర్యావరణపరమైన, దక్పథాలతో కూడిన అడ్డంకులు కారణాలుగా వుంటాయి. తమ మనుగడ కోసం చేసే పోరాటంలో వికలాంగులకు ఇవి అనుభ వంలోకి వస్తాయి. గాజా, ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లలో వికలాం గులు ఎదుర్కొనే అణచివేత మామూలుగా కంటే అనేక రెట్లు ఎక్కువగా వుంది. వారి వైకల్యం కారణంగా ప్రదర్శించే వివక్షతో పాటూ వికలాంగులకు సంబంధించిన మానవ హక్కుల అంత ర్జాతీయ చట్టాలను నీరుగారుస్తూ సాయుధ బలగాలు వికలాం గులను లక్ష్యంగా చేసుకోవడం వంటివి అందులో వున్నాయి. పదహారేళ్ళుగా గాజాను దిగ్బంధించడం వల్ల ఆ ప్రజలపై మాటల్లో చెప్పలేని రీతిలో కష్టాలు కుప్పలుగా పేరుకుపోయాయి. ముఖ్యంగా విక లాంగ జనాభాపై ఈ ప్రభావం వర్ణనాతీతం. తాజాగా వికలాంగులను లక్ష్యంగా చేసుకుని ప్రా ణాలు హరిస్తుండడంతో సాధారణ ప్రజానీకంలో భయాందోళనలు నెలకొన్నాయి.
పైగా అందుబాటులో లేని మౌలిక వస తులు, సహాయకులు, సహాయపరికరాలు కొర వడడం, ముఖ్యావసరాల సేవలకు అంతరాయం, నిరంతర రిపేర్లు, మరమ్మతులు వల్ల వికలాంగులు తీవ్రంగా ఇబ్బందుల పాలవుతున్నారు. వారి జీవితం భయానకంగా తయారైంది. సురక్షిత ప్రదేశాలను (షెల్టర్ హౌమ్‌లు, రెస్క్యూ, రిలీఫ్ శిబిరాలు) వెతుక్కోవడంలో అనేక అడ్డంకులను ఎదుర్కొం టున్నారు. సాధారణంగానే ఇవి అందుబాటులో వుండవు. పైగా వికలాంగుల అవసరాలకు అనుగుణంగా వుండవు. దాంతో దృశ్య, వినికిడి, మేథోపరమైన వైకల్యాలు వున్న వారికి ముందస్తు హెచ్చరికల వ్యవస్థలతో పాటుగా కీలకమైన సమాచారాన్ని అం దించడంలో అదనపు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. నిరంతర దాడుల వంటి పలు కారణాల వల్ల మానసిక వికలాంగుల వుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్న వార్తలు వస్తున్నాయి. నిరంతర బాంబు దాడులతో, వ్యక్తిగత నష్టాలతో పిల్లలు భయంతో వణికిపోతున్న వీడియోలు చూస్తుంటే మనసు ముక్కలవక మానదు. వికలాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందు లను గుర్తిస్తూ, వారి భద్రతకు, సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈ ఏడాది నవంబరు 8న ఒక ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. సాయుధ ఘర్షణల సందర్భాల్లో వికలాంగులపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2475కు, అలాగే సిపిఆర్‌డితో సహా అంతర్జాతీయ మానవతా చట్టం, మానవ హక్కుల చట్టం కింద వున్న నిబంధన లన్నింటినీ గౌరవించి, వాటికి కట్టుబడి వుండడం అనివార్యం.
”అంతర్జాతీయ మానవతా చట్టం, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టంతో సహా అంతర్జాతీయ చట్టాల ప్రకారం వారి బాధ్యతలకు అనుగుణంగా ప్రభుత్వాలు సాయుధ ఘర్షణలు, మానవతాపరమైన అత్యవసర పరిస్థితులు, ప్రకతి విపత్తులు వంటి ముప్పులు తలెత్తినపుడు వికలాంగుల రక్షణకు, భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి.” అని సిపిఆర్‌డిలోని 11వ అధికరణ పేర్కొంటోంది. ”పున రావాసం, మానసిక తోడ్పాటుతో సహా సాయుధ ఘర్ష ణల కారణంగా ప్రభావితులైన వికలాంగులకు వారికి గల ప్రత్యేక అవసరాలను తీర్చేలా, ముఖ్యంగా వికలాం గులైన మహిళలు, చిన్నారుల అవసరాలు తీరేలా సుస్థిరమైన రీతిలో, సకాలంలో, సముచిత రీతిలో సాయం అందించాల”ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2475 పేర్కొంటోంది. స్వతంత్ర, స్వేచ్ఛా మాతృభూమి కోసం పాలస్తీనియన్లు చేస్తున్న డిమాండ్ కు ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాలు, పట్టణాల్లో వికలాంగు లతోసహా వేలు, లక్షల సంఖ్యలో ప్రజలు మద్దతునిస్తుంటే, పలు ప్రభావవంతమైన ప్రభుత్వాలు ప్రత్యక్షం గానో, పరోక్షంగానో పాలస్తీనియన్ల ఊచకోతకు మద్దతునివ్వడం హదయాన్ని కలిచి వేస్తోంది. ఐక్యరాజ్యసమితి వంటి సంస్థల నిస్సహాయత, వైఫ ల్యం బహిర్గతమయ్యాయి. మానవహక్కుల ఒప్పందాలు, వికలాంగుల హక్కుల ఒప్పందాలన్నీ పూర్తిగా నీరు గార్చబడుతున్నాయి.
ఈ నేపథ్యంలో, ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు కట్టుబడి వుండాలి. ఘర్షణల్లో చిక్కుకున్న, ఘర్షణల కారణంగా వికలాం గులైన వారికి అవసరమైన మద్దతు, సాయాన్ని అందించాలి. పాలస్తీనా ప్రజలపై, వారి ఆస్తులపై దాడులను ఇజ్రాయిల్ తక్షణమే ఆపాలి. ఆక్రమిత భూభాగాల నుండి వైదొలగడంతో పాటు 1967కు ముందు సరి హద్దులను గౌరవించాలి. రెండు దేశాల ఏర్పాటు దిశగా మార్గాన్ని వేయాలి. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నాడు, స్వేచ్ఛ కోసం, మాతభూమిపై తమ హక్కు కోసం పాలస్తీనా ప్రజలు సాగించే న్యాయమైన పోరాటానికి ఎన్‌పిఆర్‌డి (వికలాంగుల హక్కుల జాతీయ వేదిక) మద్దతునిస్తోంది. వికలాంగుల హక్కులు ఈ పోరాటంలో విడదీయలేని భాగమని భావిస్తోంది.
వి. మురళీధరన్