కిసాన్ సెల్ మండలాధ్యక్షుడిగా రొడ్డ మల్లేశం

నవతెలంగాణ – బెజ్జంకి
కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ నూతన మండలాధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన రొడ్డ మల్లేశం నియామకమైయ్యారు. మంగళవారం జిల్లా కేంద్రంలో కిసాన్ సెల్ జిల్లాధ్యక్షులు బాలకృష్ణ రెడ్డి, నాయిని నర్సింహ రెడ్డి రొడ్డ మల్లేశంకు నియామకపత్రమందజేశారు. నాపై నమ్మకంతో కిసాన్ సెల్ మండలాధ్యక్షుడిగా నియమించిన జిల్లాధ్యక్షులకు, మండల నాయకులకు రొడ్డ మల్లేశం కృతజ్ఞతలు తెలుపుతూ రైతుల సమస్యల పరిష్కారానికి శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి, నాయకులు శ్రావణ్, ఒగ్గు దామోదర్, డీవీరావు, రాజు తదితరులు నియామకపత్రమందజేతలో పాల్గొన్నారు.