
మండలంలోని ప్రాజెక్టు నగర్ పసర టప్ప మంచ, మొట్లగడెం గ్రామాలకు చెందిన 80 కుటుంబాలక వరద బాధితులకు రోసా రెసిడెన్షియల్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టిటి డబ్ల్యూ ఆర్ ఎస్ ఎటురునాగారం స్కూల్ అధ్వర్యంలో 80 వరద బాధిత కుటుంబాలకు గురువారం ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఎటూరునాగారంలో కలసి చదువుకున్న పూర్వ విద్యార్థులు అలాగే గురువులు కలసి వరద బాధితులకు సహాయం చేయడం కోసం కొంత కూడ పెట్టి ఈ గ్రామాలకు ఇవ్వడం జరిగిందీ అనంతరం రోసా అధ్యక్షుడు చాప బాబుదొర మాట్లాడుతూ వరదల్లో సర్వస్వం కోల్పోయిన మీకు మేము చేసిన సహాయం చాలా చిన్నది.. మీకు మీరూ చేసుకున్న సహాయం చాలా గొప్పది. వరదల సమయంలో మి తోటి వారిని తొరగా మెల్కొల్పి వారినీ ప్రాణాలకు తెగించి సురక్షిత ప్రాంతాలకు తరలించందుకు చేసుకున్న సేవా గొప్పది. యూత్ సభ్యులను, సర్పంచ్ సమ్మయ్యని అభినందిస్తూ భవిష్యత్ లో ఇలాంటి విపత్తుల సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు., టీవీ రాజు ప్రిన్సిపాల్ మాట్లాడుతూ వరదల ఆనంతరం వచ్చే వ్యాధుల నుండి రక్షించుకోవాలి అన్నారు. జిఎస్ రాజా నాయక్ మాట్లాడుతూ వరదల సమయంలో ప్రభుత్వ చెప్పిన విధంగా ముందుగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్లి ఉన్నట్లు ఐతే బాగుండేది చనిపోయిన ముగ్గురి ప్రాణాలు దక్కేవి అన్నారు. ఈ కార్యక్రమంలో గురువులు ఓం బ్రమ్మమ్, రాం బ్రమమ్మ్, ప్రిన్సిపాల్ రాజు , కోశాధికారి సక్రునాయక్, కొమరం ప్రభాకర్, పురుషోత్తం, హిసిలాల్, వెంకట్, బాబూరావు, గ్రామస్తులు మొదలగు వారు పాల్గొన్నారు.