అంతర్జాతీయ స్థాయిలో రోటరీ క్లబ్ నిజామాబాద్ నకు ప్రత్యేక గుర్తింపు

నవతెలంగాణ – కంటేశ్వర్
రోటరీ అంతర్జాతీయ స్థాయిలో చేస్తున్నటువంటి సేవలకు గుర్తిస్తూ రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్నకు అంతర్జాతీయ అత్యున్నత పురస్కారాలలో రోటరీ ఇంటర్నేషనల్ అవార్డును అందుకున్నారని అంతర్జాతీయ అధికారులు తెలపడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రోటరీ క్లబ్ నిజామాబాద్ అధ్యక్షులు సతీష్ షాహ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విశాల్ ఆకుల వారి సంవత్సర కాలంలో విద్యా, వైద్యం ,ఆరోగ్యం, పరిశుభ్రత, పర్యావరణం వంటి అంశాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి అత్యున్నత పురస్కారం అందుకోవడం జరిగిందని తెలిపారు. రోటరీ జిల్లా 3150 పరిధిలోగల తెలంగాణలోని జిల్లాలు ఆంధ్రాలోని జిల్లాలలో ఉన్నటువంటి 96 క్లబ్ లలో కేవలం 30 క్లబ్లలకు మాత్రమే ఈ అత్యున్నత పురస్కారాలు లభించాయని అందులో నిజామాబాద్ ఉండడం ఒక ప్రత్యేక గుర్తింపు ఆని అన్నారు. రోటరీ క్లబ్ నిజామాబాద్ సభ్యులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, పత్రికా పాత్రికేయులు అందరి సహకారంతో ఈ పురస్కారాన్నికి ఎంపిక కావడం జరిగిందని అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు.