పెన్నార్‌కు రూ.669 కోట్ల ఆర్డర్‌

హైదరాబాద్‌ : ఇంజనీరింగ్‌, సొల్యూషన్స్‌ కంపెనీ పెన్నార్‌ గ్రూపునకు రూ.669 కోట్ల వ్యాపార అర్డర్లు దక్కినట్టు తెలిపింది. వీటిని ఆర్‌ఎల్‌ఆర్‌ ఇన్‌ఫ్రా, ఎస్‌ఎన్‌జె డిస్టిలరీస్‌, అంటరిక్స్‌ గ్రూపు, టాయిన్‌ ఇన్‌ఫ్రా, పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌, ఎస్‌ఆర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, టివిఎస్‌ సంగ్లి, ఎంఎస్‌ఆర్‌ అసెట్స్‌ తదితర కంపెనీల నుంచి అందుకున్నట్లు పెన్నార్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.