– సబ్ స్టేషన్, బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన.. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని చంద్రాయాన్ పల్లి గ్రామంలో సబ్ స్టేషన్, రూప్లానయక్ తండా నుండి మేగ్యనయక్ తండా వరకు బిటి రోడ్డు నిర్మాణం, రూప్లానయక్ తండాలో నుతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి, సామ్య నాయక్ తండాలో బిటి రోడ్డు నిర్మాణంకు శంకుస్థాపన చేపట్టనున్నట్లు ఎంపిపి బాదవత్ రమేష్ నాయక్ తెలిపారు.బుదవారం ఇందల్ వాయి మండల పరిషత్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.రూప్లానయక్ తండా లో 20 లక్షల రూపాయలతో నుతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, చంద్రయాన్ పల్లి గ్రామంలో 5లక్షల రుపాయలతో ఒపేన్ జిమ్, 2కోట్ల10 లక్షల రూపాయలతో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం,రుప్లానయక్ తాండా నుండి మేగ్య నాయక్ తండ వరకు లింకు రోడ్డు నిర్మాణం కు 4కోట్ల 25లక్షలు, సామ్య నాయక్ తండా లో బిటి రోడ్డు నిర్మాణానికి 85లక్షలతో పనులకు గాను శంకుస్థాపన చేపట్టనున్నట్లు ఎంపిపి బాదవత్ రమేష్ నాయక్ వివరించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి 58 షాదీ ముబారక్ ఏడు చెక్కులను అందజేయన్నట్లు ఆయన తెలిపారు. బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చిలివెరి గంగా దాస్ మాట్లాడుతూ… గురువారం ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ చంద్రయాన్ పల్లి గ్రామ పర్యటనను మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన సర్పంచ్లు ఎంపీటీసీలు పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చిలివేరి గంగాదాస్ కోరారు.
విస్తృత ఏర్పాట్లు.. హర్షాతిరేకాలు..
గ్రామంలో సబ్స్టేషన్ లింకు బీటీ రోడ్లకు శంకుస్థాపన విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయా గ్రామాల సర్పంచులు తెలిపారు. తమ ఎన్నో ఏళ్ల నుండి కోరుకుంటున్న ఆరోజు రానే వచ్చిందని లింక్ రోడ్డు వల్ల ఎన్నో కిలోమీటర్ల దూరం తగ్గిందని సర్పంచులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.