జగపతిబాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘రుద్రంగి’. అజరు సామ్రాట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమత మోహన్‌దాస్, విమల రామన్ ఈ హీరోయిన్లుగా నటించారు. ఈనెల 7న సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలకష్ణ మాట్లాడుతూ, ‘రుద్రంగి లాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. మా నాన్న(ఎన్టీఆర్) అలాంటి సినిమాలు చాలా చేశారు. ఇప్పుడు జగపతి బాబు అలాంటి సినిమా చేస్తూ ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఏదైనా పాత్ర చేసేటప్పుడు అందులో నటించడం కంటే జీవించడం గొప్ప. అలాంటి నటుడే జగపతి బాబు’ అని తెలిపారు.’బాలయ్య ‘లెజెండ్’ సినిమానే నాకు మళ్ళీ ప్రాణం పోసింది. ఇక హీరోగా మళ్లీ నా మూడవ ఇన్నింగ్స్‌కి కూడా బాలయ్య నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను ‘లెజెండ్’ తర్వాత ఎన్నో సినిమాలు చేశాను కానీ అందులో చెప్పుకోదగ్గవి 10 కూడా లేవు. ఈ సినిమాతో మళ్లీ నాకు మంచి గుర్తింపు వస్తుంది అనుకుంటున్నాను’ అని జగపతిబాబు అన్నారు.
చిత్ర నిర్మాత రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, ‘బాలయ్య సపోర్ట్‌కి కృతజ్ఞతలు. జగపతిబాబు లేకపోతే అసలు ఈ సినిమానే లేదు. ఆయన పాత్రకి ప్రాణం పోశారనే చెప్పుకోవాలి. తెలంగాణ యాసలో ఆయన డైలాగులు అందరికీ గుర్తుండిపోతాయి’ అని చెప్పారు.
ఆశిష్ గాంధీ మాట్లాడుతూ, ‘జగపతిబాబుతో ఇది నా రెండవ సినిమా. మల్లేష్ లాంటి పవర్‌ఫుల్ పాత్ర నాకు ఇచ్చినందుకు డైరెక్టర్‌కి కతజ్ఞతలు’ అని తెలిపారు. ‘ప్రతి డైరెక్టర్ తన సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేస్తారు. కానీ నేను నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుని ఈ సినిమాని పూర్తి చేశాను. ఈ సినిమా ఇలాంటి మరొక వంద సినిమాలను నాంది పలకాలి అని కోరుకుంటున్నాను’ అని డైరెక్టర్ అజరు సామ్రాట్ చెప్పారు. ఈ సినిమాలో నన్ను జ్వాల పాత్రలో ఎంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని మమత మోహన్ దాస్ తెలిపారు.