
– యూనిట్ లు వందల్లో…
– దరఖాస్తులు వేలల్లో..
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ ప్రభుత్వం పథకాలు పై పథకాలు అమలు చేయాలని యోచన చేయడంతో ఒకదాని తర్వాత మరొక దానికి దరఖాస్తు ఆహ్వానిస్తుంది. దీంతో ఆశావాహులు అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటున్నారు.యూనిట్ లు తక్కువ గానూ ఆశావాహులు ఎక్కువ గా ఉండటంతో అధికార పార్టీ కి తలనొప్పిగా మారింది.దీంతో ఎవరు అధికార పార్టీ కి మద్దతు ఇస్తున్నారు?ఏ నాయకుడు పార్టీకి విధేయుడు గా ఉంటున్నాడు?ఆ నాయకుడి అనుచరులకు ఎంతమందికి ఇవ్వాలని సమీకరణాలు,సమాలోచనలు చేసి మరీ అనుయాయులు ను ఎంపిక చేస్తున్నారు. బీసీ కుల వృత్తులు వారికి ఆర్ధిక ఋణం ఇవ్వడం పూర్తైన క్రమంలో ముస్లిం మైనార్టీ సామాజిక వర్గాల వారికి మైనార్టీ ఎకనామిక్ సపోర్ట్ పేరుతో మరో పథకం అమలు చేస్తున్నారు. నియోజక వర్గం వ్యాప్తంగా 120 యూనిట్లు మంజూరు కాగా ఇప్పటికే 12 యూనిట్ లను మంజూరు చేసారు.మిగత 108 యూనిట్ లకు నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలం కోటా 30 యూనిట్ లు.దరఖాస్తులు 176 వచ్చాయి.ఇదివరకే 6 యూనిట్ లను బ్యాంకు లే నేరుగా మంజూరు చేయగా మిగతా 24 యూనిట్ ల ఎంపికను గురువారం ఎం.పి.పి జల్లిపల్లి శ్రీరామమూర్తి నేతృత్వం లో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిక చేసారు. ఇందులో జెడ్.పి.టి.సి వరలక్ష్మి భర్త,పార్టీ మండల అధ్యక్షుడు బండి పుల్లా రావు,అధికారి ప్రతినిధి యు.ఎస్ ప్రకాశ్,మందపాటి రాజమోహన్ రెడ్డి,పట్టణ అధ్యక్షుడు సత్యవరపు సంపూర్ణ, కాసాని చంద్రమోహన్, మోటూరు మోహన్ లు మజీద్ కమిటీ పెద్దల సూచనలు మేరకు లబ్ధిదారులను ఎంపిక చేసారు.అయితే ఈ ఎంపికలో అధికారుల ప్రమేయం లేకపోవడం విచారకరం అని మండల స్థాయి అధికారులు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.