ఆటో ఢీకొని సఫాయి కార్మికుడి మృతి

నవ తెలంగాణ- నవీపేట్: మండల కేంద్రంలోని లింగమయ్య గుట్టకు చెందిన సఫాయి కార్మికుడు గడ్డం  ఎల్లయ్య (45) మృతి చెందినట్లు ఎస్సై యాదగిరి గౌడ్ ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గ్రామపంచాయతీలో సఫాయి కార్మికుడిగా పనిచేసే గడ్డం ఎల్లయ్య స్థానిక  రైల్వే గేటు దాటుతుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొనడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స కోసం 108లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు తెలిపారు. సోదరుడు గడ్డం చందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.