జీతం ఫుల్‌… విధులు నిల్‌..!

– బడుల వైపు కన్నెత్తి చూడని ఉపాధ్యాయులు
– విద్యాశాఖ ఆదేశాలు బేఖాతర్‌ చేస్తున్న వైనం
– చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు
నవతెలంగాణ-రాయపర్తి
తప్పటడుగుల నుంచి తప్పించాల్సినవారే తప్పు టడుగులు వేస్తున్నారు… పిల్లలను సక్రమమార్గంలో నడిపి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన వారే విధులకు ఎగనామం పెడుతూ వక్రబుద్ధి ప్రదర్శిస్తు న్నారా ? అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వి నిపిస్తున్నాయి. ప్రభుత్వం ఆశించిన మేర ఉపాధ్యా యులు అంతటిస్థాయిలో పనిచేస్తున్నారా? అంటే స మాధానం వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తోంది. వివరా ల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఈనెల 12న జీవో నెం.79/జీఈఎన్‌/2023 జారీ చేస్తూ ప్రతి సెకండరీ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయు డు, సీనియర్‌ అసిస్టెంట్‌ లేదా క్లర్క్‌, అటెండర్‌ విధు లకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయగా ‘నవ తెలంగాణ’ మండలంలోని పాఠశాలలను సందర్శించింది. వివిధ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యా యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ జీతం ఫుల్లు విధులు నిల్లు అనే చందంగా ప్రజాధనాన్ని దండుకుంటున్నారు. మండలంలో 12 సెకండరీ ప్ర భుత్వ పాఠశాలలు ఉండగా కొత్తూరు, పెర్కవేడు, కొ లనుపల్లి పాఠశాలలు మినహా కాట్రపల్లి, రాయపర్తి, మైలారం, ఊకల్‌, కొండూరు, సన్నూరు ప్రభుత్వ పా ఠశాలల తలుపులు తెరుచుకోలేదు. వివిధ గ్రామా లకు చెందిన ప్రధానోపాధ్యాయులు పాఠశాలల వైపు ఓర కంటైనా చూడకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా కాట్రపల్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఓ ఉ పాధ్యాయుడు ఏడుకొండల వెంకటేశ్వరుడికిని తలనీ లాలు ఇచ్చినట్టే వ్యవహరిస్తున్నాడని గ్రామస్తులు అంటున్నారు. రాష్ట్రసర్కారు అందిస్తున్న పూర్తివేతనం తీసుకుంటూ విధులకు డుమ్మా కొడుతూ పవిత్రమైన ఉపాధ్యాయ వత్తికి మచ్చ తెస్తున్నారు అని మండల ప్రజలు విమర్శిస్తున్నారు. జీతాలు అధిక మొత్తంలో తీసుకుంటూ విధులకు హాజరుకాని ఉపాధ్యాయుల పై చర్యలుతీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు వి ద్యాశాఖ ఉన్నత అధికారులను డిమాండ్‌ చేస్తున్నారు.
పదవ తరగతిలో 50 మంది ఫెయిల్‌…
మండలంలో 12 సెకండరీ ప్రభుత్వ పాఠశాల ల్లోని 453 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 40 3 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా 50 మంది వి ద్యార్థులు ఫెయిల్‌అయ్యారు. అందులో ఫెయిల్‌అ యిన విద్యార్థులు అధికశాతం సెన్స్‌ సబ్జెక్టులో తప్పి నట్లు సమాచారం. సర్కారు బడులను ప్రభుత్వం అ న్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ విద్య నైపుణ్యాన్ని పెం పొందించేందుకు ఎన్ని కార్యక్రమాలను తీసుకొచ్చిన ప్పటికీ కొంతమంది ఉపాధ్యాయుల తీరుతో ప్రభుత్వ లక్ష్యం మసకబారుతుంది. ఎంతోమంది ఉపాధ్యాయు లు విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం అహర్నిశలు కషి చేస్తుండగా కొంతమంది ఉపాధ్యాయులు ప్రైవేటు వ్యాపారాలను మూడు పువ్వులు ఆరుకాయ లుగా పెంపొందించుకుంటూ ఉపాధ్యాయ వృత్తిని ని ర్లక్ష్యం చేస్తున్నారు. ఇలాంటి ఉపాధ్యాయులు మారాలని ప్రజలు కోరుకుంటున్నారు.
హాజరుకాని ఉపాధ్యాయులపై చర్యలు : నోముల రంగయ్య, రాయపర్తి ఎంఈఓ
విధులకు హాజరుకాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటాను. 12వ తేదీ నుంచి ఉన్నత పాఠశాల్లో ఉపాధ్యాయులు విధులకు హాజరు కావాల్సిఉంది. కానీ కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యా యులు హాజరు కాకపోవ డం బాధాకరం. విచారణ చేపట్టి విధులకు హాజరు కాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటాము.