సాల్వ్ ఫర్ టుమారో 2023 టాప్ 10 టీమ్స్ ను ప్రకటించిన శామ్ సంగ్ ఇండియా

– యువ ఆవిష్కరణకర్తలు ఇప్పుడు రూ. 1.5 కోట్ల బహుమతి డబ్బు కోసం పోటీపడతారు
– తమ ప్రోటోటైప్స్ ను మెరుగుపరచడానికి, టాప్ 10 టీమ్స్ ఇప్పుడు రూ. 100,000 చొప్పున పొందడటమే కాకుండా శామ్ సంగ్ ఉద్యోగులు మరియు ఐఐటీ ఢిల్లీలోని పరిశ్రమకు చెందిన నిపుణులు నుండి సలహాలు కూడా పొందుతారు.
– టాప్ 10 టీమ్స్ సరికొత్త గాలక్సీ జడ్ ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ పొందుతారు; 3 జాతీయ స్థాయి విజేతలు మొత్తం  రూ. 1.5 కోట్లు బహుమతి నగదుగా గెలుపొందుతారు.
నవతెలంగాణ – గురుగ్రామ్: తమ జాతీయ విద్యా మరియు ఆవిష్కరణ పోటీ, ‘సాల్వ్ ఫర్ టుమారో ‘ యొక్క టాప్ 10 టీమ్స్ ను శామ్ సంగ్ ఇండియా ఈ రోజు ప్రకటించింది. భారతదేశపు జెన్ Z  ఆవిష్కరణ స్ఫూర్తి,  చురుకుదనం మరియు సామాజిక బాధ్యతలను సంబరం చేస్తోంది. ఈ టాప్ 10 టీమ్స్ కు చెందిన యువత సముద్ర నీటిని తాగు నీరుగా మార్చడం, పంటలలో తెగుళ్లు, కీటకాలను గుర్తించడం, బీచ్ లను శుభ్రం చేయడం, మరింత సుస్థిరమైన  లెదర్ ట్యానింగ్ ప్రక్రియను  అభివృద్ధి చేయడం నుండి వినికిడి లోపం కలిగిన వారికి మరింత సదుపాయం కల్పించడం వంటి నిజ జీవితంలోని సమస్యలను పరిష్కరించడానికి తమ ఆలోచనలు అందచేసారు. సంకేత భాషను వినియోగించే వారితో సమాచార లోపం లేకుండా ఉండటం, తప్పిపోయిన పిల్లలను అన్వేషించడం, వేసవి కాలంలో ప్రజలు వేడి లేకుండా చల్లదనం కలిగి ఉండటం మరియు కళ్లు లేని వారు చదవగలడంలో సహాయపడటం వంటి ఆలోచనలు కూడా వారు సమర్పించారు. టాప్ 10 టీమ్స్ ఉత్తర్ ప్రదేశ్ లోని మాహారాజ్ గంజ్, అస్సాంలో లఖీమ్ పూర్, గోలాఘాట్, పశ్చిమ బెంగాల్ లో డార్జిలింగ, గుజరాత్ లో సూరత్ మరియు అహ్మదాబాద్, కేరళలో ఎర్నాకులం, చెన్నై, ఢిల్లీలు నుండి పాల్గొన్నారు. టాప్ 10 టీమ్స్ గురించి మరియు వారి ఆలోచనలు గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి-www.samsung.com/in/solvefortomorrow పోటీ రెండవ సంవత్సరం కోసం, శామ్ సంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY’s) వారి స్టార్టప్ హబ్ మరియు ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ & టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ (ఎఫ్ఐటీటీ), ఐఐటీ ఢిల్లీతో భాగస్వామం చెందింది. ఐఐటీ ఢిల్లీలో బూట్ క్యాంప్  జరిగిన తరువాత  సాల్వ్ ఫర్ టుమారో 2023 యొక్క టాప్ 10 టీమ్స్ ఎంపిక చేయబడ్డాయి. ఈ టీమ్స్  బెంగళూరులోని శామ్ సంగ్ ఇండియా కార్యాలయాలు, సంస్థ ఆర్ & డీ కేంద్రాలు, డిజైన్ కేంద్రం మరియు శామ్ సంగ్ ఒపేరా హౌస్ సందర్శించి అక్కడ శామ్ సంగ్ ఉద్యోగులు, పరిశోధకులతో చర్చించారు. బూట్ క్యాంప్ లో, శామ్ సంగ్ మరియు సంస్థ భాగస్వాములు ఎఫ్ఐటీటీ మరియు MeitY స్టార్టప్ హబ్ వారికి సలహాలు ఇచ్చాయి, తమ ఆలోచనలు మెరుగుపరుచుకోవడంలో సహాయపడ్డాయి. తొలి నమూనాలు తయారు చేయడానికి, తదుపరి శామ్ సంగ్ యువ ఉద్యోగుల జ్యూరీకి తమ ఆలోచనలు సమర్పించడానికి  ప్రతి టీమ్ కు రూ. 20,000 అందచేయబడ్డాయి. ప్రతి టీమ్ సభ్యునికి శామ్ సంగ్ గాలక్సీ బుక్ 3 ప్రో 360 ల్యాప్ టాప్ మరియు గాలక్సీ బడ్స్ 2 ప్రోతో పాటు బూట్ క్యాంప్ కు హాజరైనందుకు సర్టిఫికెట్ కూడా లభించింది. “మేము మన ‘సాల్వర్స్’ తో  గర్విస్తున్నాం. తమ ఆలోచనలు ద్వారా, వారు ఈనాడు భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి తమ అభిరుచి చూపించారు.  వారి విభిన్నమైన నేపధ్యాలు సాల్వ్ ఫర్ టుమారో 2023ని మరింత సమీకృతం చేసింది మరియు తమ పూర్తి సామర్థ్యం సాధించడానికి ఆధునిక తరానికి సాధికారత కల్పించి, మద్దతునివ్వడంలో మరియు సానుకూలమైన సామాజిక మార్పులకు మార్గదర్శకత్వంవహించడంలో శామ్ సంగ్ తన వంతు బాధ్యతను పోషించగలదని మేము ఆనందిస్తున్నాము. శామ్ సంగ్ మరియు దాని భాగస్వాములు నుండి నిపుణుల సలహాతో తమ పరిష్కారాలను ఈ టాప్ 10 టీమ్స్ ఏ విధంగా శక్తివంతం చేయగలవో అని మేము ఎదురుచూస్తున్నాం,” అని శ్రీ. హ్యూన్ కిమ్, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్, శామ్ సంగ్ నైరుతి ఆసియా అన్నారు. “మన దేశపు యువ మేధస్సులు అలాంటి కొత్త ఆలోచనలతో ముందుకు రావడం ఎంతో గొప్పగా ఉంది. టాప్ 10 టీమ్స్ నిజంగా మనల్ని ప్రేరేపించారు. శామ్ సంగ్ సాల్వ్ ఫర్ టుమారో ప్రోగ్రాంతో, మేము ఈ యువత కొత్త ఉన్నతమైన స్థాయిలు చేరుకోవడానికి మరియు వారి ఆచోలనలు అమలు చేయడానికి సహాయపడతాము, దేశాన్ని మారుస్తాము,” అని శ్రీ. జీత్ విజయ్, సీఈఓ,  MeitY స్టార్టప్ హబ్ అన్నారు. దేశ యువతలో కొత్త ఆలోచనలు మరియు సమస్యలను పరిష్కరించే సంస్కృతిని ప్రోత్సహించే లక్ష్యంతో, ఈ పోటీ నాలుగు ఇతివృత్తాలు- చదువు & నేర్చుకోవడం, ఆరోగ్యం & సంక్షేమం, పర్యావరణం & సుస్థిరత మరియు విభిన్నత & చేరికలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి 16-22 సంవత్సరాల వారిని ఆహ్వానించింది. సాల్వ్ ఫర్ టుమారో 2023లో భారతదేశంలోని 500 పట్టణాలు, నగరాలు, గ్రామాలకు చెందిన యువత పాల్గొని భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలను నిర్వహించడంలో సహయపడటానికి భారత్ యొక్క ఆవిష్కరణ మరియు ఔత్సాహిక స్ఫూర్తికి ప్రతీకగా తమ ఆలోచనలను సమర్పించారు.
ఈ క్రింద టాప్ 10 టీమ్స్ మరియు వారు పరిష్కరిస్తున్న సమస్యలు ఇవ్వబడ్డాయి:
డీమీటర్:
పంటలలో వ్యాధులు, కీటకాలను గుర్తించడానికి పరిష్కారం అభివృద్ధి చేస్తున్నారు.
హాక్ వెంజర్స్: సంకేత భాషా వివరణ డివైజ్ అభివృద్ధి చేస్తున్నారు, ఇది సంకేత భాషా యూజర్స్ మరియు సంకేత భాషను వినియోగించని వారి మధ్య సమాచారం అంతరాన్ని తీరుస్తుంది.
జల్ రాజ్: సముద్ర నీటిని త్రాగు నీటిగా వినియోగించడానికి త్రాగునీటి పరిష్కారం గురించి కృషి చేస్తోంది.
మిలాన్: తప్పిపోయిన తమ పిల్లలను కనుగొనడంలో కుటుంబాలకు సహాయపడే యాప్ అభివృద్ధి చేసింది.
మస్కిటీర్స్: వినికిడి లోపంతో ఉన్న వ్యక్తులు కోసం యాక్సెసబిలిటీ మరియు చేరికను మెరుగుపరచడానికి పరిష్కారాన్ని అభివృద్ధి చేస్తోంది, సమాచార అడ్డంకులను అధిగమించి వారు సమాజంలో పూర్తిగా పాల్గొనడానికి  వీలు కల్పిస్తుంది.
ఎన్ఐటీ సూరత్:  చెత్తా, చెదారాలు పెద్ద ఎత్తున సేకరించబడే బీచ్ లను శుభ్రం చేసే సమస్యను పరిష్కరించడాన్ని కనుగొంటోంది.
రిలీథర్డ్: మరింత సుస్థిరమైన లెదర్ ట్యానింగ్ ప్రక్రియను అభివృద్ధి చేస్తోంది.
టెగ్: కమ్యూనిటీ ప్రాజెక్ట్ కు విద్యుత్తును అందించే బయో గ్యాస్ ను తయారు చేయడానికి కెఫ్టీరియాస్ నుండి ఆహార వ్యర్థాలను పునః వినియోగిస్తోంది.
థింక్ : తీవ్రమైన ఎండల్లో వేసవి వేడి నుండి తట్టుకుని చల్లగా ఉండటంలో ప్రజలకు సహాయపడే పరిష్కారాన్ని అభివృద్ధి చేస్తోంది.
టచ్ ప్యాడ్: టాక్టైల్ డిస్ ప్లే-ఆధారిత ప్యాడ్ వినియోగించడం ద్వారా అంధులు చదవడానికి పరిష్కారాన్ని అభివృద్ధి చేస్తోంది.
అక్టోబర్ 2023లో నిపుణులైన జ్యూరీ ముందు తమ అంతిమ నమూనాను ప్రదర్శించడానికి రాబోయే 12 వారాలు టాప్ 10 టీమ్స్ తమ నమూనాలను మెరుగుపరచడం పై పని చేస్తాయి. దీని కోసం, ప్రతి టీమ్ అదనంగా రూ. 100,000 పొందుతాయి మరియు శామ్ సంగ్ ఉద్యోగులు మరియు ఢిల్లీలోని ఐఐటీలోని పరిశ్రమ నిపుణులు నుండి సహాయం, సలహాలు పొందుతారు. వీరు టీమ్స్ కు టెక్నాలజీ, డిజైన్, మార్కెటింగ్, పాలసీ వంటి వివిధ అంశాలలో అవగాహన కల్పిస్తారు. ఈ 10 టీమ్స్ టీవీ సీరీస్ లో కూడా కనిపిస్తారు. న్యూస్ 18 గ్రూప్ సీరీస్  సమర్పిస్తోంది. జాతీయ ఛానల్స్ మరియు ఓటీటీ ప్లాట్ ఫాం జియో సినిమా పై కూడా ఈ సీరీస్ ప్రసారం చేయబడతాయి. టీమ్స్ గాలక్సీ జడ్ ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ కూడా పొందుతారు. వార్షిక కార్యక్రమం మూడు జాతీయ స్థాయి విజేతల ప్రకటనతో ముగుస్తుంది. వీరు రూ. 1.5 కోట్లు బహుమతి నగదుగా గెలుపొందుతారు. 2010లో యూఎస్ లో మొదటిసారిగా ఆరంభించబడిన సాల్వ్ ఫర్ టుమార్ ప్రస్తుతం అంతర్జాతీయంగా 63 దేశాల్లో అమలవుతోంది మరియు ప్రపంచవ్యాప్తంగా దీనిలో 2.3 మిలియన్ యువత పాల్గొన్నారు.