సామ్‌సంగ్‌ ‘సాల్వ్‌ ఫర్‌ టుమారో’ పోటీ

న్యూఢిల్లీ : సామ్‌సంగ్‌ ఇండియా టెక్‌ ఆవిష్కరణల కోసం సాల్వ్‌ ఫర్‌ టుమారో పోటీని ప్రకటించినట్టు తెలిపింది. ఇప్పటికే దీనికి 50వేల పైగా రిజిస్ట్రేషన్లు వచ్చాయని పేర్కొంది. తమ ఆలోచనలను కార్యరూపంలో ఉంచడానికి పోటీలో నిలిచే ప్రముఖ మూడు బృందాలకు రూ.1.5 కోట్లు గెలుపొందే అవకాశం ఉందని తెలిపింది. మే 31 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు వెల్లడించింది.