హైదరాబాద్ : మాస్టర్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ తెలంగాణ నూతన అధ్యక్షురాలుగా ఎం. సంగీత ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని ఒలింపిక్ భవన్‌లో శనివారం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్‌గా సంగీత ఎన్నిక కాగా.. కార్యదర్శిగా సంతోశ్ కుమార్ ఎన్నికయ్యారు. మాస్టర్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ తెలంగాణ నూతన ఆఫీస్ బేరర్లను తెలంగాణ ఒలింపిక్ సంఘం కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ అభినందించారు.