తెలంగాణ యూనివర్సిటీ అడిషనల్ కంట్రోలర్ గా శాంతాబాయి నియామకం..

నవతెలంగాణ -డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ ఇంచార్జీ వైస్ ఛాన్సలర్ వాకాటి కరుణ  ఐఏఎస్ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి  డాక్టర్. పి శాంతాబాయి కి అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ గా  నియామక ఉత్తర్వులను మంగళవారం అందజేశారు. గతంలో డాక్టర్. శాంతాబాయి  డైరెక్టర్ గా ఎస్సీ, ఎస్టీ సెల్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామర్ గా, బాలికల వసతి గృహానికి వార్డెన్ గా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెల్ కు డైరెక్టర్ గా, యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలకు వైస్ ప్రిన్సిపల్ గా విధులు నిర్వహించారు. ఈ నియామకపు ఉత్తర్వులు అందుకున్న డాక్టర్. శాంతాబాయి మాట్లాడుతూ.. యూనివర్సిటీ అభివృద్ధిలో భాగం పంచుకుంటా మని వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ లకు  కృతజ్ఞతలు తెలిపారు.