బహుజనుల చక్రవర్తి సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌

నవతెలంగాణా – ముత్తారం: బహుజనుల చక్రవర్తి సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ అని గౌడ సంఘం నాయకులు అన్నారు. పీడత ప్రజల బహుజన పాలకుడు సర్వాయి పాపన్న గౌడ్‌ 373వ జయంతి వేడుకులను గౌడ సంఘం నాయకులు శుక్రవారం ముత్తారం మండల కేంద్రంఓల నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అగ్రకుల పెత్తనాన్ని అణచాలంటే ఒక్కరితో సాధ్యం కాదని మొత్తం బహుజన కులాలను ఏకం చేసి తన స్నేహితులతో కలిసి గెరిల్లా సైనాన్ని తయారు చేసిన మహావీరుడు పాపన్న గౌడని అన్నారు. ఆయన ఒక యోధుడిగా తెలంగాణ పీడిత ప్రజల, జనుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాండని అన్నారు. కార్యక్రమంలో పలువురు గౌడ సంఘం నాయకులున్నారు